Mohan Babu : టీవీ 9 ఆఫీస్ కి గన్ తో వెళ్ళిన మోహన్ బాబు..!

October 21, 2021 9:21 AM

Mohan Babu : రీసెంట్ గా టాలీవుడ్ లో జరిగిన మా ఎన్నికలు సాధారణ రాజకీయాల్ని తలపించాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణుకి మోహన్ బాబు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ కి, మంచు విష్ణుకి మధ్య టఫ్ కాంపిటీషన్ నడిచింది. ఈ క్రమంలో పోల్ మేనెజ్ మెంట్ విషయం గురించి సీనియర్ జర్నలిస్టు జాకీర్ వివరించారు. ఈ క్రమంలో మోహన్ బాబు జాకీర్ వర్క్ చేసే ఛానల్ కి గన్ తో వచ్చి ఎండీని బెదిరించారంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

Mohan Babu came to tv9 office with gun jakeer told

మోహన్ బాబు రౌడీయిజాన్ని జాకీర్ ప్రాక్టికల్ గా చూశానని అన్నారు. తాను టీవీ 9 లో వర్క్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి ఇష్యూ టీవీ 9 లో వార్త వచ్చింది. వెంటనే మోహన్ బాబు డైరెక్ట్ గా తుపాకీ పట్టుకుని టీవీ 9 ఆఫీస్ కి వచ్చి.. రవి ప్రకాష్ ఎక్కడా.. కనిపిస్తే కాల్చిపడేస్తాను అంటూ బెదిరించారు. నిజానికి ఆ వార్త తప్పు అయినప్పుడు ప్రెస్ మీట్ లో ఖండించొచ్చు.. లేదా కోర్టుకి వెళ్ళి పరువునష్టం దావా వేయొచ్చు.

కానీ అలా కాకుండా డైరెక్ట్ గా ఛానల్ కి వచ్చి కాల్చేస్తా అంటే ఆయన కోపం ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుందని జర్నలిస్ట్ జాకీర్ అన్నారు. అలాగే మా ఎన్నికల్లో కొంతమందిని బెదిరించారని కూడా అన్నారు. ఆయన కోపమే ఆయన్ను ఎప్పటికైనా ముంచేస్తుందని జాకీర్ అన్నారు. అలాగే పోల్ మేనేజ్ మెంట్ లో మోహన్ బాబుకు ఎవరినైనా కొట్టగలిగే సామర్థ్యం ఉందని.. ఎందుకంటే ఆయన రౌడీయిజం అలాంటిదని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now