Acharya Movie : ఆచార్య మూవీ.. థియేట‌ర్లు అన్నీ ఖాళీన‌ట‌.. యాంటీ ఫ్యాన్స్ ప్ర‌చారం.. తిప్పికొడుతున్న ఫ్యాన్స్‌..!

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్‌తొలిసారిగా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర‌ల్లో న‌టించిన మూవీ.. ఆచార్య‌. ఈ సినిమా శుక్ర‌వారం ఏప్రిల్ 29వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల అవుతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌, పోస్ట‌ర్స్‌కు విశేష రీతిలో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా.. అని మెగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదాపడ్డ ఈ మూవీ ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌వుతోంది. దీంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోతున్నాయి. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు ఏ మూవీ వ‌చ్చినా నెగెటివ్ టాక్‌ను వ్యాపింపజేసే కొంద‌రు ఈసారి కూడా ఆచార్య‌పై అలాంటి ప్ర‌చార‌మే చేస్తున్నారు.

Acharya Movie

సాధార‌ణంగా చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌.. మూవీలు ఏవైనా స‌రే మొద‌టి వారం రోజులు థియేట‌ర్స్ ఫుల్ అయిపోతాయి. సీట్లు అస‌లు దొర‌క‌వు. ఆ విషయం అంద‌రికీ తెలుసు. కానీ కొంద‌రు యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఆచార్య సినిమా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతున్న థియేట‌ర్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయ‌ని.. బుక్ మై షో యాప్‌లో చూస్తే మొత్తం గ్రీన్ క‌ల‌ర్‌లో సీట్లు ఖాళీగా ఉన్న‌ట్లు క‌నిపిస్తుందని.. విమ‌ర్శిస్తున్నారు. అలాగే ఇదే విష‌యంపై ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న నెగెటివ్ ప్ర‌చారాన్ని మెగా అభిమానులు బాగానే తిప్పి కొడుతున్నారు. కొంద‌రు కావాల‌నే ఈ మూవీపై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని, వారి మాట‌లు న‌మ్మొద్ద‌ని, థియేట‌ర్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే అటు యాంటీ ఫ్యాన్స్‌కు, ఇటు ఫ్యాన్స్‌కు మ‌ధ్య మీమ్స్‌, ట్రోల్స్ యుద్ధం జ‌రుగుతోంది. అయితే వాస్త‌వానికి మెగాస్టార్ సినిమా అంటేనే క‌చ్చితంగా థియేట‌ర్స్ ఫుల్ అవుతాయి. ఆ విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ కొంద‌రు కావాల‌నే ప‌నిగట్టుకుని ఇలా మెగా ఫ్యామిలీపై నెగెటివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ఈ మూవీని కొరటాల శివ తెర‌కెక్కించ‌గా.. పూజా హెగ్డె రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించింది. స్టాలిన్ మూవీ త‌రువాత చాలా సంవ‌త్సరాల‌కు మ‌ణిశ‌ర్మ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతం అందించ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM