గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Manchu Vishnu : అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్న విష్ణు.. ఆ ఫైల్‌ పైన తొలి సంత‌కం!

Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ ఎన్నిక‌లు హోరా హోరీగా సాగిన విష‌యం తెలిసిందే. ఇందులో ప్ర‌కాశ్ రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో గెలిచాడు. ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు కూడా కొంద‌రు గెలిచారు.…

Manchu Vishnu : అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్న విష్ణు.. ఆ ఫైల్‌ పైన తొలి సంత‌కం!

Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ ఎన్నిక‌లు హోరా హోరీగా సాగిన విష‌యం తెలిసిందే. ఇందులో ప్ర‌కాశ్ రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో గెలిచాడు. ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు కూడా కొంద‌రు గెలిచారు. అయితే వీరంద‌రూ  మూకుమ్మ‌డిగా రాజీనామాలు చేశారు. ఈ సంఘ‌ట‌న జరిగిన కొద్ది గంట‌ల‌లోనే మంచు విష్ణు ఎలాంటి హ‌డావిడి లేకుండా ట్విట్టర్‌ ద్వారా తాను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ప్రకటించారు.

Manchu Vishnu took position as maa president

ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌కు సంబంధించిన 11 మంది రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు వ్య‌వ‌హారం చాలా హీటెక్కింది. విష్ణు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడా అన్న‌ది ఆస‌క్తికరంగా మారింది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (‘మా’) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విష్ణు.. పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు. కాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

‘మా’ బై లా రూల్‌ పొజిషన్‌ 17 ప్రకారం ‘మా’లో ఎవరైనా సభ్యుడి పోస్ట్‌కు ఖాళీ ఏర్పడితే, అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయం తీసుకుని దాన్ని భర్తీ చేస్తారు. ఆ పదవికి మరొక వ్యక్తిని నామినేట్‌ చేస్తారు. అయితే.. ఆ నియామకం తర్వాత జరిగే జనరల్‌ బాడీ మీటింగ్‌లో సభ్యుల అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేసిన శ్రీకాంత్‌ స్థానంలో విష్ణు ప్యానెల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాబూమోహన్‌ను నామినేట్ చేసే అవ‌కాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి