Manchu Vishnu : అక్టోబర్ 10వ తేదీన జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ పై అధిక మెజార్టీతో గెలిచిన మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంచు విష్ణు ఆయన ప్యానల్ నుంచి గెలిచిన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదే విధంగా మంచు విష్ణు కుటుంబ సభ్యులు, మాజీ మా అధ్యక్షుడు నరేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇకపోతే ప్రకాష్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది వారి పదవులకు రాజీనామా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ 11 మంది ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం.
మంచు ప్రమాణస్వీకారోత్సవం అనంతరం పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కాగా ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిథులుగా రావాల్సి ఉండగా వారు మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…