Malavika : చాలా బాగుంది అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది మాళవిక. తరువాత దీవించండి, శుభకార్యం, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాల్లో నటించింది. రజనీకాంత్ మూవీ చంద్రముఖిలోనూ ఈమె కనిపించి అలరించింది. ఇక మాళవిక అసలు పేరు శ్వేతా కొన్నూర్ మేనన్. ఈ క్రమంలోనే మాళవిక తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పలు విశేషాలను పంచుకుంది.
తాను నటించిన తొలి తెలుగు చిత్రంలో అత్యాచారం సన్నివేశం ఉంటుందని.. ఆ సీన్‌లో నటించడం తనకు మంచిగా అనిపించలేదని.. కానీ ఓవరాల్‌గా ఆ సినిమాలో నటించడం సంతృప్తినిచ్చిందని మాళవిక సంచలన విషయాన్ని బయట పెట్టింది. అప్పట్లో సీయు ఎట్ 9 అనే హిందీ సినిమాలో గ్లామర్ షో చేశానని.. ఈ విషయంపై ఇంట్లో రచ్చ జరిగిందని, తన కుటుంబ సభ్యులు కోప్పడ్డారని ఆమె తెలిపింది.
తెలుగులో 5, తమిళంలో 35 చిత్రాలు చేసిన మాళవిక బన్, సమోసా అంటే ఇష్టమని చెప్పింది. కాలేజీ చదివే రోజుల్లో వాటిని తినేందుకు క్లాసులను ఎగ్గొట్టేదాన్నని గుర్తు చేసుకుంది. తనకు అప్పట్లో నాగార్జున అంటే ఇష్టం ఉండేదని, ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని తెలియజేసింది. నటులు రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్‌లతో సినిమాల్లో చేసినప్పుడు తాను ఎలా ఫీలైందో వివరించింది.
ఇటీవల వచ్చిన పుష్ప సినిమా చూశానని.. చాలా బాగుందని.. అయితే అందులో సమంత చేసిన ఐటమ్ సాంగ్ అవకాశం తనకు వచ్చినా.. అంగీకరించేదాన్నని స్పష్టం చేసింది.
తమిళంలో ఉన్నై థేడి అనే సినిమాతో మాళవిక సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించగా.. ఈమె తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లోనూ నటించింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చాలా బాగుందితో ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…