గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Liger : విజయ్‌ దేవరకొండ, అనన్యపాండే.. గుర్రాలెక్కి స్వారీ చేస్తూ హల్‌చల్‌..!

Liger : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం లైగర్ చిత్రంతో ఎంతో బిజీగా ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ఈ క్రమంలోనే…

Liger : విజయ్‌ దేవరకొండ, అనన్యపాండే.. గుర్రాలెక్కి స్వారీ చేస్తూ హల్‌చల్‌..!

Liger : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం లైగర్ చిత్రంతో ఎంతో బిజీగా ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా చిత్రబృందం మొత్తం అమెరికాలోని లాస్ వెగాస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా కొన్ని ఫోటోలను అనన్య పాండే సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసింది.

Liger movie shooting Vijay Devarakonda Ananya Pandey horse riding
Liger movie shooting Vijay Devarakonda Ananya Pandey horse riding

తాజాగా ఆమె హీరో విజయ్ దేవరకొండతో కలిసి హార్స్ రైడింగ్ వెళ్లింది. ఈ క్రమంలోనే గుర్రంపై కూర్చుని ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ “హౌడీ రౌడీ” అని రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్‌ చిత్రంలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్నారు. గత మూడు రోజుల క్రితం మైక్ టైసన్ తో కలిసి దిగిన ఫోటోలని అనన్య పాండే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

ప్రస్తుతం ఈమె గుర్రపుస్వారీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, నటి ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుందని చిత్ర బృందం వెల్లడించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి