గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Liger Movie : చాయ్‌వాలా నుండి బాక్సర్‌గా.. అదిరిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ మేకోవ‌ర్..

Liger Movie : రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నువ్విలా‌’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన‌ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. నేచురల్ స్టార్ నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించాడు. ఈ…

Liger Movie : చాయ్‌వాలా నుండి బాక్సర్‌గా.. అదిరిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ మేకోవ‌ర్..

Liger Movie : రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నువ్విలా‌’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన‌ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. నేచురల్ స్టార్ నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించాడు. ఈ సినిమాతో విజయ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. లుక్స్ పరంగానే కాకుండా నటనతోనూ ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. ఇక అర్జున్ రెడ్డితో ఫుల్ క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మార‌బోతున్నాడు.

Liger Movie glimpse is released vijay devarakonda fabulous look

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఛార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు.

వరుస అప్‌డేట్స్‌ తో లైగర్ టీమ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధ‌మైంది. తాజాగా లైగర్ నుంచి గ్లింప్స్‌ ను విడుదల చేశారు. చాయ్ వాలా టు బాక్సర్.. ముంబైలో చాయ్ వాలాగా జీవనం సాగించే వ్యక్తి ఎలా బాక్సర్‌ గా ఎదిగాడన్నది చూపించారు.

విజయ్ దేవ‌ర‌కొండ మేకోవ‌ర్ అందిరిపోయింది. లైగర్ సినిమాలో మైక్ టైసన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. సినిమా కథను ఆయన పాత్రే మలుపు తిప్పుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఆగ‌స్టు 25న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి