Kondapolam : క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం కొండపొలం. ఈ మూవీ అక్టోబర్ 8న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో వైష్ణవ్ తేజ్‌కు మరో హిట్ గ్యారెంటీ అని భావిస్తున్నారు. అయితే ఇంతలోనే కొండపొలం చిత్ర యూనిట్‌కు షాక్ తగిలింది. ఆ సినిమా మొత్తాన్ని ఇంటర్నెట్‌లో లీక్ చేశారు.
అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొండపొలం మూవీకి అన్ని వర్గాల నుంచి చక్కని ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులతోపాటు సినీ విమర్శకులు కూడా సినిమా బాగుందని కితాబిస్తున్నారు. అయితే విడుదలై ఒక్క రోజు కూడా గడవక ముందే చిత్ర యూనిట్‌కు దిమ్మ తిరిగింది. మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. మంచి కలెక్షన్లను సాధిస్తుందని ధీమాతో ఉన్నారు. మూవీ కూడా అలాగే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కానీ ఈ మూవీని తమిళ రాకర్స్ అనే సైట్ వారు లీక్ చేయడంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే ఇప్పటికే అనేక చిత్రాలు పైరసీ కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. కెరీర్ తొలినాళ్లు కావడంతో వైష్ణవ్ తేజ్ కూడా మంచి ఊపు మీద ఉన్నాడు. కానీ ఈ విధంగా సినిమా పైరసీ అయితే వారు పడే బాధ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారు సినిమా తీస్తారు. ఈ విధంగా పైరసీ అవడం అంటే.. నిర్మాతలకే కాదు, చిత్ర యూనిట్ మొత్తానికీ విచారకరమైన వార్తేనని చెప్పవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…