Vastu Tips : ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నాయంటే ఆ ఇంట్లో ఉన్న వారందరికీ కష్టాలు వస్తుంటాయి. అవి అసలు ఒక పట్టాన పోవు. ఇంట్లో ఉన్న అందరూ ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా ఏ పని చేసినా అసలు కలసి రాదు. ఆర్థిక సమస్యలు ఉంటాయి. అందరూ తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఎవరి ఇంట్లో అయినా ఈ విధంగా సమస్యలు వస్తుంటే.. అప్పుడు వారి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. వెంటనే కింద తెలిపిన విధంగా సూచనలు పాటించాలి. దీంతో ఇంట్లో ఎన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో వాస్తు దోషాలు పోయి కష్టాల నుంచి బయట పడవచ్చు.
ఇంట్లో ప్రధాన ద్వారం పైన మధ్యలో ఇత్తడితో తయారు చేసిన సూర్యుని బొమ్మను ఒకదాన్ని ఉంచాలి. సూర్యుడు సకల ప్రాణికోటికి వెలుగునిస్తాడు. అనంతమైన శక్తికి ఆయన ప్రతిరూపం. అందువల్ల ఆయన బొమ్మ ఇంటి ప్రధాన ద్వారం పైన మధ్యలో ఉంటే.. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుంది. ఫలితంగా ఇంట్లోని వారికి కష్టాలు తప్పుతాయి. సూర్యుడు అన్నింటా మనకు విజయాలను అందిస్తాడు. కనుక ఇంటి ద్వారం మీద ఆయన బొమ్మ ఉంటే అన్ని విధాలుగా మనకు శుభాలు కలుగుతాయి.
ఇక సూర్యుడి బొమ్మ కిందనే ఇత్తడితో తయారు చేసిన స్వస్తిక్ బొమ్మను ఉంచాలి. ఇలా చేస్తే మనం ఏ పనిచేసినా విజయం సాధిస్తాం. కష్టాలు అసలు రావు. ఏ సమస్య అయినా సరే ఇట్టే పరిష్కారం అవుతుంది. ఇక చివరిగా ఇంట్లో ఈశాన్య దిశలో ఒక భారీ ఇత్తడి పాత్రను ఉంచాలి. అందులో మొత్తం నీళ్లను నింపాలి. 15 రోజులకు ఒకసారి ఆ నీటిని మారుస్తుండాలి. ఇలా చేస్తే మన ఇంట్లో కూడా ధనం అలా కలకాలం నిలిచి ఉంటుంది. ఆర్థిక సమస్యలు అసలు ఉండవు. ధనం మిక్కిలిగా సంపాదిస్తారు. ఈ విధంగా ఈ మూడు సలహాలను పాటిస్తే అన్ని కష్టాల నుంచి బయట పడవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…