Karate Kalyani : వాళ్ల భ‌ర‌తం ప‌డ‌తానంటున్న క‌రాటే క‌ల్యాణి.. పోలీసుల‌కు ఫిర్యాదు..!

May 27, 2022 5:54 PM

Karate Kalyani : న‌టి క‌రాటే క‌ల్యాణి ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచిన విష‌యం విదిత‌మే. ఈమె శ్రీ‌కాంత్ రెడ్డి అనే యూట్యూబ‌ర్‌ను ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడ‌నే కార‌ణంతో రాత్రిపూట అత‌ని ఇంటికి వెళ్లి మ‌రీ కొట్టింది. దీంతో ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఈ కేసు ఇంకో ట‌ర్న్ తీసుకుంది. క‌రాటే క‌ల్యాణి ఎలాంటి ప‌త్రాల‌ను లేకుండానే ఓ పాప‌ను ద‌త్త‌త తీసుకుంద‌ని కేసు న‌మోదు అయింది. దీంతో విచార‌ణ జ‌రిగింది. అయితే పాప త‌ల్లిదండ్రులే త‌మ‌కు స్థోమ‌త లేక పెంచేందుకు ఆమెకు ఇచ్చామ‌ని చెప్పారు. దీంతో అధికారులు ఆమెకు అన్ని ప‌త్రాల‌తోనే ద‌త్త‌త తీసుకోవాల‌ని చెప్పారు. దీంతో ఆ కేసులో క‌ల్యాణికి క్లీన్ చిట్ ల‌భించింది. అయితే క‌ల్యాణి ఇప్పుడు ప్రాంక్ వీడియోలు చేసే యూట్యూబ్ చాన‌ల్స్‌పై ప‌డింది. ఆమె ఆ చానల్స్ భ‌ర‌తం ప‌ట్టేందుకు న‌డుం బిగించింది.

ప్రాంక్ వీడియోల పేరిట యూట్యూబ్‌లో వీడియోల‌ను పెడుతున్న సుమారు 20 చాన‌ల్స్‌పై క‌ల్యాణి ఫిర్యాదు చేసింది. ఆ చాన‌ల్స్ య‌జ‌మానుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌ల్యాణి త‌న కంప్లెయింట్‌లో కోరింది. దీంతో సీసీఎస్ పోలీసులు స‌ద‌రు చాన‌ల్స్‌పై ఐటీ యాక్ట్ ప్ర‌కారం కేసులు న‌మోదు చేశారు. 67ఎ, 509 సెక్ష‌న్ల కింద కేసులు పెట్టారు. ఈ క్ర‌మంలోనే అలాంటి చాన‌ల్స్‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వారు తెలిపారు.

Karate Kalyani says she will take action on those channels
Karate Kalyani

అయితే యూట్యూబ‌ర్ శ్రీకాంత్ రెడ్డితో మొద‌ట వివాదం జ‌రిగింది ఈ ప్రాంక్ వీడియోల వ‌ల్లే. కానీ ఆమె ఆ పాప‌ను పెంచుకుంటుండడంపై ఆరోప‌ణ‌లు రావడంతో ప్రాంక్ వీడియోల కేసు పెండింగ్‌లో ప‌డింది. అయితే ఇప్పుడు ఆమెకు ద‌త్త‌త కేసులో ఊర‌ట ల‌భించ‌డంతో.. ఇక ముందుగా అనుకున్న‌ట్లుగానే ఆమె అలాంటి చాన‌ల్స్‌పై యుద్ధం ప్ర‌క‌టించింది. దీంతో ఆ చాన‌ల్స్‌ను బ్లాక్ చేయాల‌ని ఆమె కేసు పెట్టింది. అయితే పోలీసులు ఈ కేసులో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment