Kamala Pandu : ఆరెంజ్ ఫ్లేవర్ అందరికి ఇట్టే నచ్చేస్తుంది. చూడటానికి మంచి రంగు, అంతకుమించిన రుచితో ఎవరినైనా ఈ కమలా పండ్లు ఇష్టపడేలా చేస్తాయి. ఈ కమల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం, విటమిన్ C, ఫాస్పరస్, బీటా కెరోటిన్ వంటివి శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. శరీర పెరుగుదలకి, జీవక్రియలు సక్రమంగా పని చేయడంతోపాటు రక్తపోటును తగ్గించడానికి పొటాషియం శరీరానికి ఎంతో అవసరం. ఈ పొటాషియం మీడియం సైజు కమలా పండుతో దాదాపు 260 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇక పీచు శాతం సంగతి వేరే చెప్పనక్కరలేదు.
100 గ్రాముల కమలాపండు తీసుకుంటే దీనిలో మనకు 30 మిల్లి గ్రాముల విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి అనేది మన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి తో పాటు కమలా పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన కిడ్నీలో స్టోన్స్ ను కరిగించడానికి సహకరిస్తుంది. ఐరన్ అనేది మన శరీరానికి అందాలంటే విటమిన్ సి ఎంతో అవసరం. ఎప్పుడయితే మన శరీరంలో ఐరన్ పెరుగుతుందో రక్తహీనత సమస్యలు తగ్గుతాయి. కమలాలలో తక్కువ కార్బోహైడ్రేట్లు తక్కువ శక్తి ఉండటం వల్ల త్వరగా అరుగుదల అనేది వస్తుంది.
మలబద్దక సమస్యతో బాధపడుతున్న వారు కమలా పండ్లను తినడం వలన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కమలా పండ్లలో లిగ్నిన్, పెక్టీన్ అనే ఫైబర్ ఉండటం వల్ల పేగుల కదలికలు బాగా జరిగి మలబద్దకం అనేది తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా కమలాలలో నేచురల్స్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి డయాబెటిస్ పేషెంట్ కూడా చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయం లేకుండా కమలాలను నిత్యం ఆహారంగా తీసుకోవచ్చు.
ముఖ్యంగా కమలాలలో హెస్పిరిడిన్, యాంథోసైనోనిన్ అనే రెండు కెమికల్స్ ఉండటం వలన రక్తంలోకి చక్కెరను చేరకుండా నిరోధిస్తాయి. అంతే కాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు పడుకునే ముందు ఒక కమలాపండు తినడం వలన ట్రిప్టోఫాన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి హాయిగా నిద్ర పట్టడానికి సహకరిస్తుంది. అందువల్ల ఈ పండ్లను రోజూ తింటే అనేక లాభాలను పొందవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…