Jr NTR : నందమూరి నట వారసుడిగా నిన్ను చూడాలని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు తారక్. మొదటి చిత్రం ఆశించిన మేరకు ఎన్టీఆర్ కి సక్సెస్ ను అందించలేకపోయింది. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో మొదటి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఆది, సింహాద్రి చిత్రాలతో మాస్ హీరోగా ప్రేక్షకుల మనసును కొల్లగొట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రాల సక్సెస్ తో ఎన్నో అవకాశాలను అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.
ఇటీవల ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ గా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ కు సరిసాటి ఎవరూ లేరు. డైలాగ్ డెలివరీ గాని, డాన్స్ లో జోష్ గాని, ఫైట్స్ లో ఎన్టీఆర్ స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అంత అద్భుతంగా ఉంటుంది ఎన్టీఆర్ నటన. ఎన్టీఆర్ లో ఇవే కాకుండా మరెన్నో టాలెంట్స్ ఉన్నాయి. అదేంటంటే అనేక భాషలలో మాట్లాడడం.
సాధారణంగా హీరోలు ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడడం చూస్తాము. పక్క రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు ఇతర హీరోలు ఇంగ్లీషులోనే మాట్లాడతారు. ఆర్ఆర్ఆర్ చిత్రం అన్ని భాషల్లో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. తారక్ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కర్ణాటకలో కన్నడ భాషలో మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ముంబైలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో అనర్గళంగా హిందీ, చెన్నైలో తమిళ్ మాట్లాడటం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. తమ అభిమాన హీరో ఇన్ని భాషల్లో మాట్లాడటం చూసి ఫ్యాన్స్ సైతం తెగ సంబరపడిపోయారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…