Kalyan Dhev : మెగా స్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ పేరు ఈ మధ్య ఎక్కువగా వార్తలలో వినిపిస్తోంది. శ్రీజ, కల్యాణ్‌దేవ్‌లు కొంత కాలంగా దూరంగా ఉంటున్నారని.. వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఇప్పటికీ ఈ విషయంపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంటోంది. కల్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీకి అందుకనే దూరంగా ఉంటున్నాడని కూడా అంటున్నారు.
ఇటీవలి కాలంలో మెగా ఫ్యామిలీ మొత్తం పలు సందర్భాల్లో కలసి వేడుకలు జరుపుకున్నారు. కానీ వాటిల్లో ఎక్కడా కల్యాణ్ దేవ్ కనిపించలేదు. దీంతో కల్యాణ్‌దేవ్, శ్రీజ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయింది. ఇక ఈ మధ్యే శ్రీజ కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ముంబై వీధుల్లో తన అన్న రామ్ చరణ్‌తో తిరిగిన ఆమె.. అలాంటి చిన్న చిన్న సంతోషమైన క్షణాల కోసమే తాను ఇంకా బతికి ఉన్నానని కామెంట్ చేసింది. దీంతో ఆమె బాధలో ఉండి ఎమోషనల్‌గా ఆ పోస్టు పెట్టి ఉంటుందని అనుకున్నారు.
ఇక కల్యాణ్ దేవ్ కూడా తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. సముద్రపు అలలతో కూడిన ఫొటోను షేర్ చేసిన కల్యాణ్ దేవ్.. చాలా సంతోషంగా.. హ్యాపీగా ఉన్నానని తెలిపాడు. అయితే అందులో అర్థం ఏమై ఉంటుందా.. అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. శ్రీజకు అతను విడాకులు ఇచ్చాడని.. అందుకనే అతను సంతోషంగా ఉన్నాడని కొందరు అంటున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో శ్రీజ ఎక్కడ తిరిగినా.. ఒంటరిగానే కనిపిస్తుంది కానీ పక్కనే కల్యాణ్ దేవ్ ఉండడం లేదు. ఇక అతని సినిమాలను కూడా మెగా ఫ్యామిలీ ఎక్కడా ప్రమోట్ చేయడం లేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. మరి ముందు ముందు ఏమవుతుందో చూడాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…