Kalyan Dhev : మెగా అల్లుడిగా విజేత సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్తగా అందరికీ పరిచయమే. ఇక గత కొంత కాలం నుంచి కళ్యాణ్ దేవ్ మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడనే వార్తలు వినబడుతున్నాయి. గత క్రిస్మస్ నుంచి మెగా కుటుంబంలో జరిగే ఒక్క సెలబ్రేషన్స్ కి కూడా ఆయన హాజరు కాలేదు. అలాగే శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాలలో కళ్యాణ్ పేరును తొలగించడంతో ప్రతి ఒక్కరూ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సందేహాలను వ్యక్తం చేశారు.
ఈ విధంగా శ్రీజ, కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి ఇటు మెగా కుటుంబం గానీ లేదా అటు కళ్యాణ్ దేవ్ కానీ ఏమాత్రం స్పందించలేదు. ఇక మెగా కుటుంబం కళ్యాణ్ సినిమాలకు కూడా ఏమాత్రం ప్రమోషన్స్ నిర్వహించకపోవడంతో వీరి మధ్య ఏవో మనస్పర్థలు తలెత్తాయనే అనుమానాలు వస్తున్నాయి.
ఇలా వీరి గురించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ కళ్యాణ్ దేవ్ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన తదుపరి చిత్రం కిన్నెరసాని సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే కళ్యాణ్ తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలను చూస్తుంటే కళ్యాణ్ తన లైఫ్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలను షేర్ చేసిన కళ్యాణ్ దేవ్ వీకెండ్ ముందు తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కళ్యాణ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…