గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Kajal Aggarwal : భర్త కోసం కాజల్‌ అగర్వాల్‌.. అందరినీ రిక్వెస్ట్‌ చేస్తోంది..!

Kajal Aggarwal : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం సినిమాతో తొలిసారిగా అడుగుపెట్టిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి అందరికి తెలిసిందే. ఆ తర్వాత నటించిన చందమామ సినిమాతో కుర్రాళ్ళ హృదయాలలో చందమామగా నిలిచింది. ఇక మగధీర సినిమాతో…

Kajal Aggarwal : భర్త కోసం కాజల్‌ అగర్వాల్‌.. అందరినీ రిక్వెస్ట్‌ చేస్తోంది..!

Kajal Aggarwal : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం సినిమాతో తొలిసారిగా అడుగుపెట్టిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి అందరికి తెలిసిందే. ఆ తర్వాత నటించిన చందమామ సినిమాతో కుర్రాళ్ళ హృదయాలలో చందమామగా నిలిచింది.

Kajal Aggarwal requests film makers for a role for her husband

ఇక మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకొని వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్ళింది.

ఇక గత ఏడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బాగా బిజీగా మారింది. కేవలం సినిమాల విషయంలోనే కాకుండా తన భర్త విషయంలో కూడా బాగా కేరింగ్ తీసుకుంటోంది. తాజాగా తన భర్త విషయంలో మరో నిర్ణయం తీసుకుంది. త్వరలోనే తన భర్తను కూడా సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది.

ప్రస్తుతం తాను నటించనున్న సినిమాలలో తన భర్తకు ఏదైనా చిన్న పాత్ర అయినా ఇప్పించాలని మేకర్స్ ను కోరుతోందట. ఇక ఆ పాత్ర కీలకంగా ఉండాలని కండిషన్ లు కూడా పెడుతుందని తెలుస్తోంది. మొత్తానికి కాజల్ తన విషయంలోనే కాకుండా తన భర్త విషయంలో కూడా అస్సలు తగ్గట్లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య సినిమాతోపాటు పలు సినిమాలతో ఆమె బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి