గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Kajal Aggarwal : భర్తతో కలిసి మందు కొడుతున్న వెండితెర చందమామ.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

Kajal Aggarwal : వెండితెరపై సందడి చేసే సెలబ్రిటీలు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా డబ్బును సంపాదిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఈ సమాజానికి ఉపయోగపడే బ్రాండ్లను ప్రమోట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం సమాజాన్ని…

Kajal Aggarwal : భర్తతో కలిసి మందు కొడుతున్న వెండితెర చందమామ.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

Kajal Aggarwal : వెండితెరపై సందడి చేసే సెలబ్రిటీలు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా డబ్బును సంపాదిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఈ సమాజానికి ఉపయోగపడే బ్రాండ్లను ప్రమోట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం సమాజాన్ని తప్పుదోవ పట్టించే హానికరమైన వాటికి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పొగాకు, గుట్కా, పాన్ వాటికి ప్రమోట్ చేయడం వల్ల యువత తీవ్రంగా నష్టపోతున్నారు.

Kajal Aggarwal drinking liquor with husband and promoting it netizen fire

గత కొద్ది రోజుల క్రితం తెలుగు నటి రెజీనా సిగ్నేచర్ విస్కీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేయడంతో ఈ ఫోటోని వైరల్ చేస్తూ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా యువతను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరించడం ఏంటి ? అంటూ నెటిజన్లు ఏకిపారేశారు.

https://www.instagram.com/p/CVsPa-QsThL/?utm_source=ig_web_copy_link

రెజీనా విషయం మర్చిపోకముందే వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి టీచర్స్ బ్రాండ్ మందు తాగుతూ ఈ పండుగను టీచర్స్ బ్రాండ్ స్మూతీ లిక్విడ్ తో సెలబ్రేట్ చేసుకోండి, ఇది ఫర్ ఫెక్ట్ కాంబినేషన్. ఈ విస్కీ బ్రాండ్ కి మేము అంబాసిడర్ గా మారినందుకు నాకు, కిచ్లుకి ఎంతో సంతోషంగా ఉంది. అయితే 25 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఈ బ్రాండ్ సేవించాలి.. అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ఈ పోస్టు చూసిన నెటిజన్లు నీకు డబ్బుకు కొదవ లేదుకదా మరెందుకు ఇలాంటి బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు.. అంటూ పెద్దఎత్తున ఫైర్ అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి