Kaikala Satyanarayana : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. కొన్ని రోజుల ముందు ఆయన ఇంట్లో జారిపడి హాస్పిటల్‌లో చేరారు. ఆరోగ్యం కాస్త కుదుటపడిందని అనుకున్న సమయంలో ఇప్పుడు మళ్లీ ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం.. వైద్యులు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని చెప్పడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కైకాల సత్యనారాయణ హెల్త్ కండిషన్ పై డాక్టర్స్ మీడియా బులెటిన్ విడుదల చేయగా, ఆందోళన కలిగిస్తోంది.
కైకాల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ ప్రెస్ నోట్ లో వెల్లడించారు. ఐసీయూలో రెస్పిరేటరీ సిస్టమ్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరంలోని ప్రధాన అవయవాలు విఫలం చెందినట్లు వెల్లడించిన వైద్యులు, కాపాడడం కూడా చాలా కష్టం అన్నట్లు ధృవీకరించారు. శనివారం ఉదయం కైకాల సత్యనారాయణ జ్వరం, నీరసంతో ఆసుపత్రిలో చేరారు.
కైకాలకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల బృందం ఆయనను కాపాడడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంపై మాత్రం నమ్మకం లేదని తెలియజేస్తున్నారు. హెల్త్ బులిటెన్ తర్వాత పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కైకాల సత్యనారాయణ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకుడిగా, కమెడియన్ గా.. ఇలా అన్నీ రకాల ప్రాతలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాతగానూ సినిమాలను రూపొందించారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…