Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంత కొద్ది రోజుల పాటు కోర్టు కేసులంటూ తిరిగింది. తరువాతా ఆ బాధ నుంచి మరిచిపోయేందుకు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ.. ఇతర ప్రాంతాలకు టూర్లు కూడా వేసింది. అయితే విడాకులను అనౌన్స్ చేసిన తరువాత నుంచి సమంత గోల్ మారినట్లు తెలుస్తోంది. కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఆమె పెట్టుకుందని సమాచారం. అందులో భాగంగానే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు.
ముఖ్యంగా ఆమె విడాకుల తరువాత రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు.. ఆహాలో వెబ్ సిరీస్, బాలీవుడ్‌లో తాప్సీతో కలిసి ఓ మూవీలో నటిస్తుందని అంటున్నారు. ఇక పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్‌కు ఎలాగూ కన్‌ఫాం అయిపోయింది. అందులో ఆమె డ్యాన్స్ చేసినందుకు గాను ఏకంగా ఒక్క పాటకే రూ.1.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని అంటున్నారు.
పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సమంత దర్శక నిర్మాతలకు కండిషన్స్‌ను కూడా పెట్టిందట. కేవలం 5 రోజులు మాత్రమే ఆమె ఆ సాంగ్‌కు కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పాట షూటింగ్‌ను ఒకే లొకేషన్‌లో చేయాలని.. దాన్ని కూడా రామోజీ ఫిలిం సిటీలో చేయాలని చెప్పిందట. దీంతో పుష్ప యూనిట్ ఆమె కండిషన్స్‌కు ఓకే చెప్పిందని తెలుస్తోంది.
ఇక సమంత వరుస సినిమాలతో బిజీగా మారగా.. విడాకుల అనంతరం ఆమె జోరు పెంచిందని తెలుస్తోంది. నాగచైతన్యతో కలసి ఉన్నప్పుడు ఆమె గోల్ వేరే. ఫ్యామిలీ, పిల్లలు.. అని ప్లాన్ చేసినట్లు గతంలోనే తెలిసింది. అయితే ఇప్పుడు ఆమె విడిపోయింది కనుక.. ఇప్పుడామె ముందున్న లక్ష్యం ఒక్కటే.. డబ్బు సంపాదించడం.. సినిమాల్లో, సిరీస్‌లలో నటిస్తూ పేరు తెచ్చుకోవడం. అంతే.. మరి ఎంత కాలం సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తుందో చూడాలి. అసలే అక్కినేని అనే పేరు కూడా పోయింది. మరి ఆమె గ్రాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…