KA Paul : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలో రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ వివిధ రకాలుగా నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నారు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే పవన్ ప్రస్తుతం రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే ఆయన వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సైతం పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలోగానీ.. తెలంగాణలో కానీ.. పోటీ ఎలా చేయాలా.. అన్న అంశంపైనే పవన్ ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఎదుట మూడు ఆప్షన్లు కూడా కనిపిస్తున్నాయి.
పవన్ వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుకు పోకుండా కేవలం తన జనసేన పార్టీతోనే ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. లేదా టీడీపీ, బీజేపీలతో వేర్వేరుగా.. లేదా కలిసి అయినా పొత్తు పెట్టుకోవచ్చు. ఇలా పవన్ ఎదుట మూడు ఆప్షన్లు ఉన్నాయి. వాటినే ఆయన పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయం ఎన్నికల ముందు వరకు తేలిపోనుంది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ ఈసారి ఎలాగైనా గెలిచి చూపించాలని తహతహలాడుతున్నారు. కనుకనే ఆయన ఆ దిశగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పవన్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్‌కు ఆయన రూ.1000 కోట్లు ఇస్తానన్నారు. కానీ అందుకు ఒక షరతు విధించారు.
పవన్ తన పార్టీలో చేరి పోటీ చేయాలని కేఏ పాల్ కోరారు. అయితే పవన్‌ను తన పార్టీ తరఫున గెలిపించుకుంటామని.. ఒక వేళ ఓడిపోయిన పక్షంలో పవన్‌కు తాను రూ.1000 కోట్లను నష్ట పరిహారం కింద చెల్లిస్తానని పాల్ అన్నారు. పవన్ జనసేన పార్టీకి తెలంగాణలో లేదా ఏపీలో ఇతర పార్టీలను ఓడించే సత్తా లేదని.. కనుక తమ పార్టీలో చేరాలని పాల్ కోరారు. అయితే పాల్ ఆఫర్‌పై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇప్పటికే ఆయనపై ఈ విషయమై ట్రోల్స్ వస్తున్నాయి. మరి పాల్ ఆఫర్‌ను పవన్ స్వీకరిస్తారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…