Puri Jagannadh : మహేష్ నటించిన లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇందులో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. సముద్రఖని విలన్ పాత్రలో కనిపించారు. రివ్యూలతోపాటు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్నందున ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. ఇక వీకెండ్‌లో ఇంకా ఎక్కువ కలెక్షన్లను రాబడుతుందని ఆశిస్తున్నారు. అయితే ఈ మూవీ దర్శకుడు పరశురామ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్, మహేష్ బాబులకు మధ్య గ్యాప్ వచ్చిందా.. అని అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.
గతంలో మహేష్, పూరీ కాంబినేషన్‌లో తెరకెక్కిన పోకిరి, బిజినెస్‌మ్యాన్ చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. పోకిరి సినిమా అయితే మహేష్ కెరీర్ లో అప్పట్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అందులో మహేష్‌కు జోడీగా మొదట్లో అయేషా టకియాను తీసుకోవాలని పూరీ అనుకున్నారు. కానీ ఆ అవకాశం ఇలియానాను వరించింది. దీంతో ఆ మూవీతో ఇలియానా దశ తిరిగి పోయింది. అనేక సినిమాల్లో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే మహేష్, పూరీ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రాలేదు. దీంతో వారి మధ్య ఏదో జరిగిందని.. అందుకనే చాలా గ్యాప్ వచ్చిందని.. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై పరశురామ్ క్లారిటీ ఇచ్చారు.
మహేష్, పూరీ జగన్నాథ్‌ల మధ్య గ్యాప్ వచ్చిందని మీరు భావిస్తున్నారా.. అని అడిగిన ప్రశ్నకు పరశురామ్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదన్నారు. మహేష్ దర్శకులను మారుస్తూ సినిమాలు చేస్తున్నారు. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. అందువల్ల పూరీతో సినిమా మళ్లీ చేయలేకపోతున్నారు. లేదంటే మహేష్, పూరీ కాంబినేషన్‌లో మరిన్ని చిత్రాలు వచ్చేవి. అయినా సరైన కథ దొరకాలే కానీ.. ఆ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందని.. ఆశిస్తున్నానని తెలిపారు.
ఇక పరశురామ్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పేశారు. తాను వాస్తవానికి మహేష్ మహర్షి మూవీ సమయంలోనే ఆయనకు సర్కారు వారి పాట కథ చెప్పానని.. దీంతో ఓకే చేశారని.. అయితే సరిలేరు నీకెవ్వరు వెంటనే చేయాల్సి వచ్చిందని.. కనుక ఆ మూవీ తరువాత సర్కారు వారి పాట చేశామని తెలిపారు. అయితే మహేష్ తో ఈ మూవీ ఆలస్యం అవుతుంది కనుక ముందుగా చైతూతో 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సినిమా చేద్దామని చైతన్యను సంప్రదించానని ఆయన ఓకే చెప్పారని తెలిపారు.
అయితే సడెన్‌గా మహేష్ సర్కారు వారి పాట చేద్దామని అన్నారని.. దీంతో చైతన్యను తరువాత సినిమా చేద్దామని రిక్వెస్ట్ చేశానని.. మహేష్‌తో మళ్లీ అవకాశం రాదేమోనని.. కనుక మీ సినిమా నేను తరువాత చేస్తానని చైతూకు చెప్పానని.. దీంతో చైతూ సానుకూలంగా స్పందించారని.. ఆయన ఓకే చెప్పాకే సర్కారు వారి పాటకు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని.. అలా ఈ మూవీని తెరకెక్కించామని పరశురామ్ తెలిపారు. ఈ క్రమంలోనే మహేష్, పూరీల మధ్య ఉన్న విషయాలపై పరశురామ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…