Ira Khan : సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హీరోలు హీరోయిన్‌లే కాదు.. వారి పిల్లలు కూడా ట్రోలర్స్ బారిన పడుతున్నారు. ఇటీవలే జీవితా రాజశేఖర్ కుమార్తెలు దుబాయ్‌టూర్‌కు వెళ్లగా.. వారు ఎవరితోనే లేచిపోయారు.. అంటూ పుకార్లు పుట్టించి ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన జీవిత మాట్లాడుతూ ఏడ్చినంత పనిచేసింది. తమ ఫ్యామిలీపై తప్పుడు వార్తలు రాయొద్దని, వీడియోలు పెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ అలాంటి ట్రోల్స్, వార్తలు, వీడియోలు మాత్రం ఆగడం లేదు. ఇక బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ కూడా ఈ మధ్య ట్రోలర్స్ బారిన పడింది. ఇరా ఖాన్ బర్త్ డే వేడుకలను జరుపుకోగా.. ఆ సమయంలో ఆమె బికినీ ధరించింది. దీంతో నెటిజన్లు భారీ ఎత్తున ఆమెను ట్రోల్ చేశారు.
ఒక అగ్ర హీరో కుమార్తెవి అయి ఉండి.. అందులోనూ తండ్రిని పక్కన పెట్టుకుని.. అది కూడా పుట్టిన రోజు నాడు అలా ఛండాలంగా బికినీ ధరించడం ఏంటి.. సిగ్గులేదా.. కాస్త మంచి దుస్తులు ధరించవచ్చు కదా.. అని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. అయితే వాటిని ఆమె చూసింది కాబోలు.. ఆ బికినీ ఫొటోలకు తోడు మరిన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ వేడుకల సందర్భంగా తీసుకున్న ఇంకొన్ని ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంటే ఆమె ఆ ట్రోల్స్ ను చూసిందని.. కావాలనే నెటిజన్లకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చినట్లు ఉంటుందని.. అందుకనే ఆమె ఆ ఫొటోలను షేర్ చేసిందని.. స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఇరా ఖాన్ ఫొటోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఆమె అందాలను చూస్తే కుర్రకారుకు మతులు పోతున్నాయి.
అయితే ఇరాఖాన్‌ను నెటిజన్లు టార్గెట్ చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ అనేక సార్లు ఆమె ఇలా ట్రోలర్స్ బారిన పడింది. కానీ ఈ మధ్య కాలంలో ఈమె ఏం చేసినా ట్రోల్స్ అధికంగా వస్తున్నాయి. మరోవైపు ఇరా తనకు ఆంగ్జయిటీ డిజార్డర్ ఉన్నట్లు గతంలో తెలిపింది. ఒక క్షణంలో మామూలుగానే ఉంటానని.. తరువాతి క్షణంలో ఆందోళనకు గురవుతానని.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదని.. ఇరా తెలియజేసింది. ఇక ఇరాఖాన్ సినిమాల్లోకి రావడం లేదు. కానీ నుపుర్ శిఖారే అనే వ్యక్తితో ప్రేమాయం నడుపుతోంది. తన తండ్రి, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇటీవలే ఆమె బర్త్ డేను జరుపుకుంది. ఆ సందర్భంగా తీసిన ఫొటోలే వైరల్ అవుతున్నాయి.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…