పురావస్తు శాఖ తవ్వకాల్లో అప్పుడప్పుడు విలువైన సంపద బయట పడుతుంటుంది. పూర్వ కాలానికి చెందిన రాజులు లేదా ప్రముఖ వ్యక్తులు దాచి పెట్టిన సంపదతోపాటు విలువైన వస్తువులు ఆ తవ్వకాల్లో బయట పడుతుంటాయి. అయితే కొన్ని చోట్ల యాదృచ్ఛికంగానే ఇతర పనులకు తవ్వకాలు చేపడితే సంపద బయట పడుతుంది. కానీ ఇలా దాదాపుగా అరుదుగానే జరుగుతుందని చెప్పవచ్చు.
అయితే అక్కడ కూడా ఈ విధంగానే వేరే పనికోసం తవ్వకాలను చేపట్టారు. దీంతో ఓ సొరంగం బయటపడింది. ఆ విషయం తెలిసిన స్థానికులు అంతులేని సంపద ఉందేమోనని భావించి అక్కడ భారీ ఎత్తున పోగయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భమ్ జిల్లాలో ఉన్న రాజ్‌నగర్ అనే ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు. అయితే అనూహ్యంగా ఓ సొరంగం బయటపడింది. దీంతో ఆ సొరంగం గుండా వెళితే సమీపంలో ఉన్న ప్యాలెస్‌కు చేరుకోవచ్చని, అందులో అంతులేని సంపద ఉందేమోనని భావించిన స్థానికులు ఆ మార్గంలో తవ్వడం చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికి అక్కడ ఉన్న జనాలు పారిపోయారు. ఇక అక్కడ పనులు ఏవీ చేపట్టకుండా ప్రస్తుతం నిలిపివేశారు. కానీ ఆ సొరంగంలో ఏదో ఉందని స్థానికులు అనుకుంటున్నారు.
అయితే అది సొరంగం కాదని, గతంలో ఎవరో భవన నిర్మాణం కోసం తవ్విన మార్గమని కొందరంటున్నారు. ఇక ఈ విషయమై వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడికి సమీపంలోని రాజ్‌బరి అనే ప్రాంతంలో ప్యాలెస్ ఉంది. అయితే ఈ సొరంగం అక్కడికి అనుసంధానం అవుతుందని, దాని గుండా వెళితే సంపద లభిస్తుందని.. ప్రజలు నమ్ముతున్నారు. దీంతో పోలీసులు అక్కడ గస్తీ పెంచారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…