ఓట్ల కోసం డబ్బులు లేదా బహుమతులు ఇచ్చే వారి వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలు బయట పెట్టాలని మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల హాసన్ పిలుపునిచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ కోయంబత్తూర్‌లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
ప్రజల ఓట్లను డబ్బులు లేదా బహుమతులతో కొనాలని ఎవరైనా ఆశ చూపితే అలాంటి వారి వివరాలను ప్రజలు సోషల్ మీడియాలో పెట్టాలని, అలాంటి ప్రజల ఇళ్లకు వచ్చి వారికి శాల్యూట్ చేస్తానని కమల హాసన్ అన్నారు. ఈ విషయంపై ఎవరైనా సోషల్ మీడియాలో తనకు ట్యాగ్ చేయవచ్చని తెలిపారు.
కాగా కమల హాసన్ ఈ ఎన్నికల్లో దక్షిణ కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఇక ఎన్నికలు అంటే క్రికెట్ మ్యాచ్‌లలాంటివని, ఎన్నికల్లో గెలిచినా, ఓడినా అక్కకడితో కథ అయిపోదని అన్నారు. ఎవరు గెలిచినా ప్రజా సంక్షేమానికి, ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…