బక్రీద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా మేకలు, గొర్రెల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ఓ మేక ధర ఏకంగా రూ.1 కోటి పలికింది. అంతటి భారీ ధర పలికే సరికి ఆ మేకను చూసేందుకు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు.
సదరు మేక పేరు టైగర్. పుష్టిగా, ఆరోగ్యంగానే ఉంది. అయితే దానిపై అల్లా అని అర్థం వచ్చే విధంగా చిహ్నాలు ఉన్నాయి. పుట్టుకతోనే దానికి అవి వచ్చాయి. అందువల్లే ఆ మేకకు ఎంతటి ధర అయినా వెచ్చించి దాన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. సదరు మేకు రూ.36 లక్షల వరకు చెల్లించేందుకు కొందరు ముందుకు వచ్చారు. కానీ యజమాని మాత్రం రూ.1 కోటి చెబుతుండడం విశేషం.
ఇక మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సౌర్‌లో కొన్ని మేకలు రూ.11 లక్షల ధర పలుకుతున్నాయి. అల్లా, అహ్మద్ అని చిహ్నాలు కలిగిన మేకలు కావడంతో ఆ మేకలకు అంతటి ధర చెబుతున్నారు. ఇక ఇలాంటివే కొన్ని మేకలకు రూ.5.50 లక్షల వరకు ధర చెబుతున్నారు. కాగా బక్రీద్‌ను సౌదీ అరేబియాలో ఈ నెల 20వ తేదీన జరుపుకోనున్నారు. మన దేశంలో 21న జరుపుకుంటారు.
బక్రీద్ రోజు అల్లాకు మాంసాన్ని నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మేకలు లేదా గొర్రెలను బలి ఇచ్చాక వాటి మాంసాన్ని మూడు భాగాలు చేస్తారు. ఒక భాగాన్ని పేదలకు, రెండో భాగాన్ని బంధువులు, స్నేహితులకు ఇస్తారు. మూడో భాగాన్ని తాము ఉంచుకుంటారు. దీని వల్ల అల్లా దయ చూపిస్తాడని, ఆశీర్వచనాలు ఇస్తాడని నమ్ముతారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…