టెక్నాలజీ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే దేశాల్లో జపాన్ తొలి స్థానంలో ఉంటుంది. అక్కడ సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జపాన్ దేశం మరో అద్భుతమైన ఘనతను సాధించింది. ఏకంగా 319 టెరాబైట్స్ పర్ సెకండ్ ఇంటర్నెట్ స్పీడ్‌ను సాధించింది. అంటే 50వేల సినిమాలను ఒక్క సెకన్‌లోనే డౌన్‌లోడ్ చేయవచ్చన్నమాట. ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఇక నిజంగా ఆ స్పీడ్‌ను వాడితే ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
గతంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకులు 178 టీబీపీఎస్ స్పీడ్‌ను సాధించారు. అయితే ప్రస్తుతం జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ 319 టీబీపీఎస్ స్పీడ్‌ను సాధించింది. ఇక ప్రపంచంలోనే అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ ఇదే కావడం విశేషం.
ఇంతటి స్పీడ్ ద్వారా సుమారుగా 50వేల సినిమాలను ఒక్క సెకన్‌లోనే డౌన్ లోడ్ చేయవచ్చు. ఇక గతంలోనూ పలు దేశాలు హైస్పీడ్ ఇంటర్నెట్ వేగాలను సాధించాయి. అవి దీని ముందు తక్కువే. అయితే నాసా 400 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ను మాత్రమే ఉపయోగిస్తుంది. అంతకన్నా జపాన్ సాధించిన స్పీడే అధికం కావడం మరో విశేషం.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…