Hema : నిజ‌మా.. న‌టి హేమ ద‌గ్గ‌ర వందల కోట్ల రూపాయలు ఉన్నాయా ?

February 7, 2022 2:24 PM

Hema : తెలుగు సినిమాల్లో అనేక పాత్ర‌ల్లో న‌టించిన హేమ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఎన్నో సినిమాల్లో అనేక ర‌కాల భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈమె చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా క్యూలైన్ లో ఉన్న న‌టుడు శివ‌బాలాజీ చేయి కొరికి ర‌చ్చ చేసింది. ఇక ఇటీవ‌లి కాలంలో ఆమె ప‌లు వ‌రుస సిసిమాల‌తో బిజీగా ఉంది. మ‌రోవైపు అనేక చాన‌ల్స్‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇస్తోంది.

Hema told about whether she is having crores of rupees or not
Hema

ఇక ఈ మ‌ధ్యే ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఈమె.. త‌న సినీ కెరీర్ తొలి నాళ్ల‌లో తాను ప‌డిన ఇబ్బందుల‌ను చెప్పుకొచ్చింది. ఇప్పుడంటే షూటింగ్‌ల‌కు వెళితే కార‌వాన్ లు ఉంటున్నాయ‌ని.. కానీ ఒక‌ప్పుడు షూటింగ్‌ల‌కు బ‌య‌ట‌కు వెళితే బ‌ట్ట‌లు మార్చుకునేందుకు అస‌లు వ‌స‌తి ఉండేది కాద‌ని, టాయిలెట్స్ కూడా ఉండేవి కావ‌ని.. ఆమె తెలియ‌జేసింది. అలాగే ఒక సినిమా షూటింగ్ స‌మ‌యంలో తాను ద‌ర్శ‌కుడి వ‌ద్ద కూర్చుని భోజ‌నం చేస్తుంటే.. ప్రొడ‌క్ష‌న్ బాయ్ వ‌చ్చి త‌న ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా మాట్లాడాడ‌ని హేమ గుర్తు చేసుకుంది.

అయితే అలా మాట‌లు ప‌డ‌కూడ‌ద‌ని చెప్పే ఉన్న‌త స్థాయికి చేరుకోవాల‌ని చాలా క‌ష్ట ప‌డ్డాన‌ని హేమ తెలిపింది. ఈ క్ర‌మంలోనే త‌న వ‌ద్ద వంద‌ల కోట్ల రూపాయ‌లు ఉన్నాయా.. అని వ‌స్తున్న వార్త‌ల‌పై ప్ర‌శ్న వేయ‌గా.. అందుకు హేమ బ‌దులిచ్చింది. త‌న ద‌గ్గ‌ర వంద‌ల కోట్లు అయితే లేవు, కానీ ఉన్నంతలో ఆస్తి బాగానే ఉంద‌ని చెప్పింది. ఇక త‌న కుమార్తెకు పెళ్లి చేసి ఆమెను సెటిల్ చేసేందుకు అవ‌స‌రం అయినంత సంపాదించాన‌ని.. ఇక ముందు కూడా సంపాదిస్తాన‌ని చెప్పింది. అలాగే తాను కెరీర్ తొలినాళ్ల‌లో వేల‌ల్లోనే మాట్లాడాన‌ని.. ఇప్పుడు ల‌క్ష‌ల్లో మాట్లాడుతున్నాన‌ని చెప్పింది. త‌న‌కు డ‌బ్బుల‌ను ఎలా సంపాదించాలి, ఎలా ఖ‌ర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి.. వంటివ‌న్నీ తెలుస‌ని.. క‌నుక డ‌బ్బు విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తాన‌ని.. హేమ తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now