గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Gangubai : రాజమౌళి దెబ్బకు వెనక్కి తగ్గిన గంగూబాయి..!

Gangubai : ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలన్నీ వరుసగా విడుదలకు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో…

Gangubai : రాజమౌళి దెబ్బకు వెనక్కి తగ్గిన గంగూబాయి..!

Gangubai : ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలన్నీ వరుసగా విడుదలకు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి.

Gangubai release postponed because of rrr movie

ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR వచ్చే ఏడాది జనవరి 7 న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో.. ఎన్నో సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు.

ఇక సంక్రాంతి బరిలో దిగిన మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదలను వాయిదా వేసుకున్నారు. తాజాగా జనవరి 6వ తేదీన విడుదల కావల్సిన ఆలియాభట్ నటించిన ‘గంగూబాయి కతియవాడి’ వాయిదా పడింది. ఇందులో ఆలియాభట్, అజయ్ దేవగన్ లు కీలక పాత్రలలో నటించారు. ఇక జనవరి 7వ తేదీ విడుదల కాబోతున్న
RRR చిత్రంలోనూ వీరు నటించారు.

అయితే గంగూబాయి సినిమా కనుక 6వ తేదీన విడుదల అయితే వారి చిత్రంతో వారే పోటీపడినట్లు అవుతుంది కనుక ఈ చిత్రాన్ని జనవరి 18వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఇక గంగుబాయి సినిమాను తెలుగులో కూడా డబ్ చేస్తుండడం వల్ల ఈ సినిమా 18వ తేదీన విడుదల అయితే తెలుగులో కూడా ఈ సినిమాకి థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది. దీంతో ఈ సినిమాను మరొకసారి వాయిదా వేశారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విడుదల అయ్యే నాటికి మిగిలిన ఎవరూ తమ చిత్రాలను విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి