Sai Pallavi : తొలిసారిగా ట్రోలింగ్ కు గుర‌వుతున్న సాయిప‌ల్ల‌వి.. అన‌వ‌స‌రంగా కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కుందే..!

June 16, 2022 8:36 AM

Sai Pallavi : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె తెలుగులో న‌టించిన చిత్రాల ద్వారానే ఎక్కువ‌గా పేరు తెచ్చుకుంది. మొద‌టి నుంచి ఈమె వివాదాల‌కు దూరంగా ఉంటుంది. అలాగే ఏ కంపెనీకి కూడా ప్ర‌మోష‌న్ చేయ‌న‌ని స్ప‌ష్టంగా చెప్పేసింది. గ్లామ‌ర్ షోకు కూడా దూరంగా ఉంటాన‌ని తెలియ‌జేసింది. దీంతో సాయిప‌ల్ల‌వికి అభిమానులు బాగానే ఏర్ప‌డ్డారు. అయితే మొద‌ట్నుంచీ వివాదాలకు దూరంగా ఉండే ఈమె తాజాగా అవ‌న‌స‌ర‌మైన కామెంట్స్ చేసి వివాదాల్లో ఇరుక్కుంది. దీంతో ఆమె తాజా మూవీ విరాట ప‌ర్వంకు స‌మ‌స్య‌లు ఎదుర‌య్యేలా ఉన్నాయి.

విరాట ప‌ర్వం మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సాయిప‌ల్ల‌వి మాట్లాడుతూ.. గోహ‌త్య‌కు, కాశ్మీర్ పండిట్ల హ‌త్య‌ల‌కు పెద్ద‌గా తేడా ఏమీ లేద‌ని.. రెండూ ఒక‌టేన‌ని.. మ‌తం ముసుగులో చేసే ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను తాను తీవ్రంగా ఖండిస్తాన‌ని.. ముందు అస‌లు మ‌నుషుల‌ను మ‌నుషులుగా చూడాల‌ని.. మ‌తం రంగు పులుమొద్ద‌ని.. కామెంట్స్ చేసింది. అయితే ఈమె వ్యాఖ్యల్లోని కొన్ని క్లిప్స్‌ను మాత్ర‌మే కొంద‌రు ప్ర‌చారం చేశారు. అస‌లు ఆమె ఏం మాట్లాడిందో ప్ర‌జ‌ల‌కు స‌రిగ్గా తెలియ‌లేదు. దీంతో ఆమె ఈ కామెంట్స్ చేయ‌డం ద్వారా అన‌వ‌స‌రంగా వివాదంలో చిక్కుకుంది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో బ్యాన్‌విరాట‌ప‌ర్వం అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇలా సాయిప‌ల్ల‌వి అన‌వ‌స‌రంగా కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుపోవ‌డంతో ఇప్పుడు విరాట‌ప‌ర్వంకు స‌మ‌స్య‌లు వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి.

first time Sai Pallavi trolled by netizen
Sai Pallavi

వాస్త‌వానికి సాయిప‌ల్ల‌వి వివాదాల‌కు ఎల్ల‌ప్పుడూ దూరంగా ఉంటుంది. కానీ ఆమె ఈసారి ఎందుకో ఇలా అన‌వ‌స‌రంగా కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమె తొలిసారిగా ట్రోలింగ్‌కు, విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతోంది. ఇవ‌న్నీ చాలా సున్నిత‌మైన అంశాలు. వీటిపై సినీ సెల‌బ్రిటీలు మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌రు. కానీ సాయి ప‌ల్ల‌వికి అలా ఎందుకు అనిపించిందో.. ఏది ఏమైనా ఆమె చేసిన కామెంట్స్ వ‌ల్ల ఆమె ఇప్పుడు మొద‌టిసారిగా తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. మ‌రి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment