Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ తీసుకున్న నిర్ణ‌యంతో ఫ్యాన్స్ అసంతృప్తి

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉండి త‌రువాత మ‌ళ్లీ వ‌కీల్ సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం విదిత‌మే. అయితే ఈ మూవీ హిందీలో ఎప్పుడో వ‌చ్చేసింది. అక్క‌డ రిలీజ్ అయి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న పింక్ మూవీని రీమేక్ చేసి వ‌కీల్ సాబ్ తీశారు.

Pawan Kalyan

ఇక త‌రువాత ప‌వ‌న్ న‌టిస్తున్న భీమ్లా నాయ‌క్ చిత్రం కూడా రీమేక్ కావ‌డం విశేషం. మ‌ళ‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా భీమ్లా నాయ‌క్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ప‌వ‌న్ త‌దుప‌రి చిత్రాన్ని కూడా ఇంకో మూవీకి రీమేక్‌గా తీయ‌నున్నారు. అందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా న‌టించ‌నున్నాడు.

త‌మిళంలో హిట్ అయిన వినోద‌య సీత‌మ్ అనే మూవీని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఇందులో ప‌వ‌న్ పాత్ర నిడివి చాలా త‌క్కువ‌ట‌. సాయి ధ‌ర‌మ్ తేజ్ పాత్ర నిడివి ఫుల్ లెంగ్త్ ఉంటుంద‌ట‌. ఇక ఈ మూవీని చాలా త్వ‌ర‌గా షూటింగ్ చేసి విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో ప‌వ‌న్ న‌టిస్తున్నందుకు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

ఇది రీమేక్ మూవీ కావ‌డంతోపాటు ఇందులో ప‌వ‌న్ పాత్ర నిడివి కూడా తక్కువే. క‌నుక అలాంటి సినిమాలో ప‌వ‌న్ న‌టించ‌డం ఏంటి ? అని అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో నటిస్తే మంచిదే. కానీ సినిమాలో ఇద్ద‌రి పాత్ర‌ల నిడివి పూర్తి స్థాయిలో ఉండాల‌ని అంటున్నారు. ఇక ఒరిజినల్ క‌థ‌తో సినిమా తీయ‌కుండా ఈ రీమేక్‌ల గోల ఏంట‌ని కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం అనేక భాష‌ల‌కు చెందిన చిత్రాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రేక్ష‌కులు వాటిని ఆల్రెడీ చూసేస్తున్నారు. అలాంటి చిత్రాల‌ను రీమేక్ చేయ‌డం వ‌ల్ల క‌థ ముందుగానే తెలిసిపోతుంది క‌నుక థ్రిల్ ఏమీ ఉండ‌ద‌ని.. ప‌వ‌న్ ఇప్పటికైనా ఒరిజిన‌ల్ క‌థ‌తో సినిమా తీయాల‌ని.. అప్పుడే ఆయ‌న సినిమాల‌ను చూస్తే థ్రిల్ క‌లుగుతుంద‌ని అంటున్నారు.

ఇక ప‌వ‌న్ న‌టిస్తున్న మ‌రో రెండు చిత్రాలు.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌.. ఒరిజిన‌ల్ క‌థ‌లే కావ‌డం విశేషం. మ‌రి ప‌వ‌న్ ఈ రెండు కాకుండా ముందు ముందు తీసే చిత్రాలు రీమేక్‌వే అవుతాయా.. ఒరిజిన‌ల్ క‌థ‌తో సినిమాల‌ను తీస్తారా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM

చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో…

Thursday, 26 March 2026, 6:09 PM

‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

ధురంధ‌ర్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ఈ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు…

Thursday, 26 March 2026, 3:43 PM

హీరోయిన్లతో ఏజ్ గ్యాప్‌పై అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. ‘హాలీవుడ్‌లో లేనిది ఇక్కడేంటి?’

సినిమాల్లో సీనియ‌ర్ హీరోల‌తో యంగ్ హీరోయిన్లు న‌టించ‌డం స‌హ‌జ‌మే. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అన్ని భాష‌ల్లోనూ ఎప్ప‌టి నుంచో…

Wednesday, 25 March 2026, 7:17 PM