F3 Movie Review : ఎఫ్3 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

F3 Movie Review : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్2కు సీక్వెల్‌గా వ‌చ్చిన మూవీ ఎఫ్3. ఈ మూవీ నేడు (మే 27, 2022) థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే రాజేంద్ర ప్ర‌సాద్‌, సునీల్, ఇత‌రులు కూడా న‌టించారు. అయితే ఎన్నో అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయిన ఎఫ్3 మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా.. అస‌లు సినిమా ఎలా ఉంది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ‌..

వెంకీ (వెంక‌టేష్‌), వ‌రుణ్ యాద‌వ్ (వ‌రుణ్ తేజ్‌)లు మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన వారు. డ‌బ్బు సంపాదించేందుకు అనేక క‌ష్టాలు ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఒక రోజు విజ‌య‌న‌గ‌రానికి చెందిన ఓ పారిశ్రామిక వేత్త, సంప‌న్నుడు త‌న వార‌సుడి కోసం ఎదురు చూస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ విష‌యం తెలుసుకున్న వెంకీ, వ‌రుణ్ యాద‌వ్‌లు తామే ఆ వార‌సుల‌మ‌ని అత‌ని వ‌ద్ద‌కు వెళ్తారు. అయితే చివ‌ర‌కు ఏమవుతుంది ? క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది ? డ‌బ్బు సంపాదించాల‌నుకునే వెంకీ, వ‌రుణ్ యాద‌వ్‌ల కోరిక నెర‌వేరిందా ? అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

F3 Movie Review

ఇక ఈ మూవీలో న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్ విష‌యానికి వ‌స్తే.. కామెడీని పండించడంలో వెంక‌టేష్ ముందుంటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న అద్భుత‌మైన టైమింగ్‌తో చెప్పే డైలాగ్‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఈ మూవీలో ఆయ‌న రేచీక‌టి ఉన్న వ్య‌క్తిగా అద్భుతంగా న‌వ్వించారు. అలాగే వ‌రుణ్ కూడా చ‌క్క‌ని పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చాడు. త‌మ‌న్నా, మెహ్రీన్ ల గ్లామ‌ర్ షో స‌రేస‌రి. అలాగే ఇత‌ర న‌టీనటులు కూడా త‌మ పాత్రల ప‌రిధుల మేర బాగానే న‌టించారు.

అద్భుత‌మైన కామెడీ చిత్రాల‌ను తీయ‌డంలో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి పేరుగాంచారు. క‌నుక ఆయ‌న ప‌నిత‌నం ఈ మూవీలోనూ క‌న‌బ‌డుతుంది. ప్రేక్ష‌కుల సీట్లలో కూర్చోకుండా క‌డుపుబ్బా న‌వ్వుతారు. అలాగే ఫొటోగ్ర‌ఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, పాటలు వంటి అన్ని అంశాలు బాగున్నాయి. ఇక ఓవ‌రాల్ గా చెప్పాలంటే.. ఎఫ్2 లాగే ఎఫ్3 కూడా ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన వినోదాన్ని అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఫ్యామిలీతో క‌లిసి ఈ మూవీని ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM