Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంతపై వస్తున్న విమర్శలు ఆగడం లేదు. ఓ దశలో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని సమంత ఇటీవలే చెప్పింది. అయితే ఆ బాధ నుంచి బయట పడేందుకు ఆమె ఎక్కువగా టూర్లు వేస్తోంది. దీంతోపాటు తనకు దొరికిన ప్రతి సినిమా అవకాశాన్ని మిస్ చేసుకోవడం లేదు.
అయితే సమంత ఇటీవల సోషల్ మీడియా ఇంటరాక్షన్ నిర్వహించగా.. అందులో కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. 2017లో మీరు ప్రెగ్నెంటా ? అని అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. అవును.. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గర్భవతినే.. అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది.
ఇక చైతూ గురించి వేయించుకున్న టాటూలుపై కూడా ఆమె స్పందించింది. అవి ఇద్దరమూ వేయించుకున్నామని, అవి తమకు చాలా స్పెషల్ అని చెప్పింది. అయితే సమంత ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా సందేశాలను షేర్ చేస్తూ ఉన్నప్పటికీ తొలిసారిగా ఇలా స్పందించడం ఆమెకు ఎంతో రిలీఫ్ ఇచ్చిందని అంటున్నారు.
సినిమాల పరంగా చూస్తే సమంత ఇటీవలే పుష్ప సినిమాలో ప్రత్యేక సాంగ్‌లో కనిపించి అలరించింది. త్వరలో ఈమె నటించిన కాతువాకుల రెండు కాదల్ అనే మూవీ విడుదల కానుంది. అలాగే శాకుంతలం అనే మూవీ సైతం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…