Mega Heroes : ఈ మెగా హీరోస్ కి ఉన్న లవ్ అఫైర్స్ గురించి తెలుసా..?

August 17, 2022 8:24 PM

Mega Heroes : మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో కానీ అభిమానుల్లో కానీ ఒకరకమైన గౌరవం, అభిమానం ఉంటాయి. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మన మెగా హీరోస్ కి మాత్రం కొందరిపై క్రష్ ఉందట, అంతేకాదు ఒక అడుగు ముందుకేసి రిలేషన్స్ లో కూడా ఉన్నారట. మన స్టార్ హీరోస్ కి ఎవరెవరితో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం.

నాగబాబు కొడుకైన వరుణ్ కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. అయితే వరుణ్ రెండు సంవత్సరాలుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో డేటింగ్ చేస్తున్నాడని వార్త వైరల్ అవుతూనే ఉంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ మిస్టర్, అంతరిక్షం సినిమాల్లోని కలిసిన నటించారు. ఏకంగా మెగా ఫ్యామిలీ ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి అంటూ వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు దీనిపై ఇద్దరూ ఎప్పుడూ, ఎక్కడా స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఓ బర్త్‌డే పార్టీలో సందడి చేయడంతో మరోసారి వీరి డేటింగ్‌ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

do you know these interesting things about these Mega Heroes
Mega Heroes

ఇక మెగా మేనల్లుడు సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ కి కూడా అమ్మాయిల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సాయిధరమ్ తేజ్ కి రెజీనా కసాండ్రాతో ఎఫైర్ ఉంది అంటూ అనేక రోజులుగా వార్తలు వచ్చాయి. వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా రెజీనా కసాండ్రతో పిల్ల నువ్వు లేని జీవితం, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, నక్షత్రం సినిమాలు వచ్చాయి. ఇలా వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాలు రాగా ఈ వార్తలకు బలం చేకూరింది. అలాగే కొన్నాళ్లపాటు వీరిద్దరూ బ్రేకప్ అయినా మళ్లీ కలిసే ఉంటున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరోవైపు అల్లు శిరీష్ కూడా ఎప్పుడూ ఎఫైర్స్ తో వార్తల్లో ఉంటుంటాడు. అను ఇమ్మానుయేల్ తో ప్రేమ కాదంటా అనే సినిమాలో కలిసి నటించగా ఈ వార్తలకు ఈ సినిమాతోనే ఆరంభం అయింది. వీరిద్దరూ కలిసి ఎఫైర్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలీదు కానీ ఇలా మెగా హీరోస్ చుట్టూ ఎప్పుడూ హీరోయిన్స్ తో వార్తలు అల్లేసుకోవడం కామన్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment