Rajamouli : రాజ‌మౌళికి సంబంధించిన ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా ?

Rajamouli : ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో మ‌న ఖ్యాతిని ఎల్ల‌లు దాటించాడు. బాహుబ‌లి ఫ్రాంచైజీలో వ‌చ్చిన రెండు చిత్రాల‌ను సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌గా మార్చి ప్రేక్ష‌కులకి స‌రికొత్త వినోదం పంచాడు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. రాజ‌మౌళి.. బాహుబలి, బజరంగీ భాయిజాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రిప్ట్‌లు రాసిన ప్రముఖ దర్శకుడు కేవీ విజయేంద్ర ప్రసాద్ కుమారుడు అన్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి సంచల‌నాలు సృష్టిస్తున్నారు.

Rajamouli

రాజ‌మౌళిని చాలా మంది ముద్దుగా జ‌క్క‌న్న అని పిలుచుకుంటారు. ఆయనకు ఈ పేరు జూనియర్ ఎన్టీఆర్ పెట్టిందని చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఆ పేరు పెట్టింది అత‌ను కాదు, రాజీవ్ క‌న‌కాల. జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి తీసిన మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ 1. 2001లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో గజాలా హీరోయిన్‌గా నటించింది. రాజీవ్ ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో రాజమౌళి వర్కింగ్ స్టైల్‌కు ముగ్ధుడై అతనికి జక్కన్న అని పేరు పెట్టాడు రాజీవ్.

తెలుగులో ఎన్నో సూప‌ర్ హిట్స్ అందించిన‌ప్ప‌టికీ రాజ‌మౌళి క‌న్న‌డ‌లో నిష్ణాతుడు. ఈ భాష‌ని అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌డు. ఇక రాజ‌మౌళి త‌న కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వ‌లేదు. బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌క‌ముందు రాజ‌మౌళి ప‌లు సీరియల్స్‌కి ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించాడు. ఇక బాహుబ‌లి కోసం ఆయ‌న కుటుంబం అంతా ప‌ని చేశారు. తండ్రి క‌థ అందించ‌గా, భార్య ర‌మ‌ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌ని చేసింది. అన్న కీర‌వాణి సంగీతం అందించాడు. కొడుకు ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చూసుకున్నాడు.

తాజాగా ఎన్టీఆర్‌తో జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్లీ హిట్ కొట్టారు. రాజమౌళి ఇప్పటికే తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. తెలుగు సినిమాలు తీస్తున్నప్పటికీ ఆయనకు కన్నడతో ప్రత్యేక అనుబంధం ఉంది. కన్నడ భాషను కూడా జక్కన్న బాగా మాట్లాడగలడు.

రాజమౌళి తన ఏ సినిమా హిట్ అవ్వాలని కూడా ఇప్పటివరకు ఏ గుడికో, మసీదుకో, దర్గాకో వెళ్లలేదు. ఎందుకంటే ఆయన దేవుడ్ని నమ్మడు. కానీ దేవుడు ఉన్నాడని నమ్మేవారిని మాత్రం గౌరవిస్తాడు.

ద‌ర్శ‌కుడు శంకర్ అత్యంత విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుడు. కానీ ఆయ‌న తీసిన కొన్ని చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే రాజమౌళి మాత్రం ఓట‌మిని ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు. ఆయ‌న తీసిన‌ సినిమా ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. స్టూడెంట్ నంబర్ 1, మర్యాద రామన్న, ఈగ, ఛత్రపతి, బాహుబలి వంటి హిట్ సినిమాలు తీశారు. దీంతో రాజమౌళి టాలీవుడ్‌లో దర్శక ధీరుడిగా మారారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM