Pokiri : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో చిత్రాల్లో నటించి అలరించారు. ఈయన తీసిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. ఇక మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాల్లో పోకిరి ఒకటి. ఈ మూవీ మహేష్‌తోపాటు ఇలియానాకు, పూరీ జగన్నాథ్‌కు ఎంతో లైఫ్‌ను ఇచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే పోకిరి ఎన్నో అద్భుతాలు సృష్టించిన మూవీగా నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ మూవీని బెంచ్ మార్క్‌గా తీసుకుని సినిమాలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈ మూవీ హిట్ అయింది.
పోకిరి సినిమాకు అప్పట్లోనే రూ.12 కోట్ల మేర బడ్జెట్ కాగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఏకంగా రూ.66 కోట్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీని హిందీ, తమిళ భాషల్లోనూ రీమేక్ చేయగా.. అక్కడ కూడా హిట్ అయింది. అయితే ఇంతటి అద్భుతమైన మూవీని ఒక నటుడు మిస్ చేసుకున్నాడని తెలుసా.. అవును.. ఆయన ఇంకెవరో కాదు.. సోనూసూద్. మొదట పోకిరి సినిమా కథ సోనూసూద్ వద్దకే వచ్చిందట. కానీ ఆయన అప్పటికే టాలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందువల్ల పోకిరి చేయలేకపోయారు. దీంతో కథ మహేష్ వద్దకు చేరింది. ఇక ఆ తరువాత ఏం జరిగిందో మనకు తెలుసు.
అయితే వాస్తవానికి పోకిరి సినిమాను సోనూసూద్ చేసి ఉంటే ఆ కథ మరోలా ఉండేది. ఆయన టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో అయి ఉండేవారు. ఇప్పటికే ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేసి ఉండేవారు. కానీ పోకిరి చేయనందున ఇంకా అలాగే విలన్ పాత్రల్లో చేస్తున్నారు. అవును మరి.. అందుకే అంటారు.. దేనికైనా అదృష్టం ఉండాలని. అది లేకపోతే ఎవరూ ఏం చేయలేరు. సోనూసూద్ విషయంలో ఇది స్పష్టమైంది కూడా.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…