Bandla Ganesh : గతంలో జైలుపాలైన బండ్ల గణేష్.. శిక్ష ఎందుకు పడిందో తెలుసా?

November 2, 2021 1:13 PM

Bandla Ganesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారారు. నిర్మాతగా పలు సినిమాలు తీస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించిన బండ్ల గణేష్ కి రాజకీయాలలో తీవ్ర వ్యతిరేకత రావడంతో కొద్ది రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.

do you know that Bandla Ganesh went to jail in a case

ఈ క్రమంలోనే బండ్ల గణేష్ కి గతంలో కోర్టు జైలుశిక్ష విధించడమే కాకుండా పెద్ద మొత్తంలో జరిమానా విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయనకి కోర్టు ఎందుకు శిక్ష విధించింది, అన్న విషయానికి వస్తే.. టెంపర్ సినిమా కథ అందించిన వక్కంతం వంశీ బండ్ల గణేష్ పై వేసిన కేసులో భాగంగా వాదోపవాదనలు విన్న న్యాయస్థానం బండ్ల గణేష్ కు జైలుశిక్ష విధించడమే కాకుండా ఏకంగా రూ.15,86,550 జరిమానా విధించింది.

కోర్టు బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధించిన అనంతరం బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన బండ్లగణేష్ బెయిలుపై వెంటనే బయటకు వచ్చారు. అయితే కోర్టు ఈ విధంగా తనకు శిక్ష విధించడానికి గల కారణం.. రూ.25 లక్షల  చెక్ బౌన్స్ కేసే.  అందులో భాగంగానే ఆయనకి కోర్టు ఇలాంటి శిక్ష విధించింది. ఇక చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ త్వరలోనే పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా తీస్తానని ఇటీవలే చెప్పారు. మరో వైపు మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసి కూడా.. చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment