Maldives : మాల్దీవ్స్ వెకేష‌న్ వెళ్లి వ‌చ్చేందుకు ఒక‌రికి ఎంత ఖ‌ర్చ‌వుతుంది ? వీసా ఎలా తీసుకోవాలి ? పూర్తి వివ‌రాలు..!

Maldives : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది సెల‌బ్రిటీలు మాల్దీవ్స్‌కు వెకేష‌న్‌కు వెళ్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో అనేక దేశాల్లో కోవిడ్ ఆంక్ష‌లు చాలా క‌ఠినంగా ఉన్నాయి. దీంతో చాలా మంది మాల్దీవ్స్‌కు వెళ్లేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక జంట‌లు కూడా హ‌నీమూన్ కోసం మాల్దీవ్స్‌నే ఎంచుకుంటున్నాయి. అయితే మాల్దీవ్స్‌కు వెళ్లి వ‌చ్చేందుకు ఒక‌రికి ఖ‌ర్చు ఎంత‌వుతుంది ? వీసా ఎలా ఇస్తారు ? వంటి పూర్తి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మాల్దీవ్స్‌కు వెళ్లి వ‌చ్చేందుకు అనేక ట్రావెల్ ఏజెన్సీలు ప్యాకేజీల‌ను అందిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎంత లేద‌నుకున్నా క‌నీసం ఒక్క వ్య‌క్తికి 3 రాత్రుల వెకేష‌న్‌కు గాను రూ.55వేల వ‌ర‌కు అవుతుంది. ఇది క‌నీస ఖ‌ర్చు. అక్క‌డ ఇంకా ఏవైనా స్థ‌లాల‌కు వెళ్లి చూడాల‌నుకుంటే ఇంకాస్త ఎక్కువే అవుతుంది. అక్క‌డి హోట‌ల్స్‌, అందించే స‌దుపాయాలు, భోజ‌న ఖ‌ర్చులు, ఇత‌ర అంశాల ఆధారంగా ఈ టూర్ ప్యాకేజీ మారుతుంది. టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారికి భోజ‌న స‌దుపాయాలు, ఎయిర్ పోర్టు నుంచి పిక‌ప్, డ్రాపింగ్‌, సైట్ సీయింగ్‌.. వంటి ఖ‌ర్చులు అందులోనే ఉంటాయి. క‌నుక టూర్ బుక్ చేసుకునేట‌ప్పుడే ట్రావెల్ ఏజెన్సీల వద్ద ఈ వివ‌రాల‌ను క‌చ్చితంగా అడిగి తెలుసుకోవాలి. లేదంటే తీరా టూర్ వెళ్లాక అద‌న‌పు చార్జిల‌ను చెల్లించాల్సి రావ‌చ్చు.

ఇక మాల్దీవ్స్‌కు వెళ్లేందుకు ముందుగానే వీసా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. పాస్‌పోర్టు, రాను, పోను విమాన టిక్కెట్లు, హోట‌ల్ రిజ‌ర్వేష‌న్ వివ‌రాలు, ఎన్ని రోజులు ఉంటారు.. అనే వివ‌రాల‌ను అక్క‌డ స‌మ‌ర్పిస్తే.. ఎయిర్‌పోర్టులోనే 30 రోజుల వ్య‌వ‌ధితో వీసా ఆన్ అరైవ‌ల్ పేరిట టూరిస్టు వీసా ఇస్తారు. అవ‌స‌రం అనుకుంటే దాన్ని పొడిగించుకోవ‌చ్చు.

ఇక మాల్దీవ్స్‌లో టూరిస్టు వీసా ఉచితంగానే ఇస్తారు. ఎలాంటి చార్జిల‌ను చెల్లించాల్సిన ప‌నిలేదు. అలాగే అక్క‌డ ఉన్న‌న్ని రోజులు రోజుకు 150 డాల‌ర్లు అంటే దాదాపుగా రూ.11వేల చొప్పున చేతిలో ఉండాలి. అంటే.. ఒక వ్య‌క్తి అక్క‌డ 3 రోజుల పాటు ఉండ‌ద‌లిస్తే.. టూర్ ప్లాన్ ఆ విధంగా బుక్ చేసుకుని ఉంటే అత‌ని చేతిలో 3 రోజుల‌కు క‌లిపి రూ.33వేల‌కు పైన డ‌బ్బులు ఉండాలి. ఆ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అప్పుడే వీసా జారీ చేస్తారు. ఈ విధంగా మాల్దీవ్స్‌కు చాలా సుల‌భంగా వెళ్లి రావ‌చ్చు.

అక్క‌డ అనేక చిన్న చిన్న దీవులు ఉంటాయి. మ‌ధ్య‌లో హోట‌ల్స్‌, రిసార్టులు ఉంటాయి. ఒక్కో చోట ఉండే స‌దుపాయాల‌ను బ‌ట్టి చార్జిలు ఉంటాయి. ఆ వివ‌రాల‌ను ట్రావెల్ ఏజెన్సీల‌తో ముందుగానే మాట్లాడుకోవాలి. స‌ముద్రంలో చిన్న చిన్న ఇళ్ల‌లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిల్లో ఉంటూ చుట్టూ ఉండే స‌ముద్ర‌పు అందాల‌ను వీక్షించ‌వ‌చ్చు. ఆ దృశ్యాల‌ను త‌ల‌చుకుంటేనే మ‌న‌స్సుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అందుక‌నే చాలా మంది మాల్దీవ్స్‌కు వెళ్లేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. పైగా ఇత‌ర దేశాల‌తో పోలిస్తే అక్క‌డ‌కు వెళ్లేందుకు ఖ‌ర్చు కూడా త‌క్కువే. క‌నుక చాలా మంది అక్క‌డ విహ‌రించేందుకు వెళ్తున్నారు. మ‌రి మీకు కూడా స్థోమ‌త ఉంటే.. సుల‌భంగానే అక్క‌డికి వెళ్లి రావ‌చ్చు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM