Pooja Hegde : హీరోయిన్ పూజా హెగ్డెకు గత ఏడాది కాలం మొత్తం బాగా కలసి వచ్చిందనే చెప్పవచ్చు. ఈ అమ్మడు ఏ చిత్రంలో నటించినా అది బంపర్ హిట్ అయింది. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పూజా హెగ్డె ప్రస్తుతం తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందట. అయితే అంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈమెను హీరోయిన్‌గా తీసుకోవాలంటేనే నిర్మాతలు.. బాబోయ్ మాకొద్దు.. అనే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మరి పూజాను వారు వద్దని చెప్పడానికి గల కారణాలు ఏమిటంటే..
పూజా హెగ్డె ఇటీవలి కాలంలో నటించిన చిత్రాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌లు కావడంతో ఈమె అమాంతం తన రెమ్యునరేషన్‌ను పెంచేసింది. అయితే అక్కడి వరకు ఓకే అయినా.. ఈమె సెట్‌కు వచ్చిందంటే చాలు.. తన టీమ్ మొత్తం ఖర్చులను నిర్మాతపైనే వేస్తోందట. అవసరం లేకపోయినా 12 మంది టీమ్‌ను సెట్‌కు తీసుకువస్తోందట. వారి ఖర్చులన్నింటినీ నిర్మాతలే భరించాల్సి వస్తోందట. దీంతో ఆమె డిమాండ్లను, ఖర్చును నిర్మాతలు భరించలేక.. ఆమె వద్దులే అని అనుకుంటున్నారట.
పూజా హెగ్డె ఆ విధంగా చేస్తున్నందు వల్లే ప్రస్తుతం ఆమె ఇంకా కొత్త సినిమాలకు సైన్ చేయలేదని తెలుస్తోంది. ఆమె నటించిన రాధే శ్యామ్, బీస్ట్ చిత్రాల షూటింగ్ పూర్తయింది. దీంతో ప్రస్తుతం పూజా ఖాళీగానే ఉంటోంది. అయితే కొందరు మీడియం బడ్జెట్ నిర్మాతలు అంతకు ముందు పూజాతో సినిమాలు తీయాలని అనుకున్నారట. కానీ ఆమె డిమాండ్లు, ఆమె పెట్టిస్తున్న ఖర్చు చూసి వెనుకడుగు వేశారట. లేదంటే ఈ అమ్మడి చేతిలో నాలుగైదు సినిమాలు ఉండేవని అంటున్నారు. మరి ఈమె రానున్న రోజుల్లో అయినా తన పంథాను మార్చుకుంటుందా.. సినిమా చాన్స్‌లను దక్కించుకుంటుందా.. అన్నది చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…