Anchor Sreemukhi : ప్రస్తుత తరుణంలో హీరోయిన్ల కన్నా యాంకర్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఏ ఈవెంట్‌కు అయినా.. ఏ షోకు అయినా సరే.. యాంకర్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వారు గలగలా మాట్లాడుతూ సందడి చేస్తారు. కనుక హీరోయిన్ల కన్నా యాంకర్లదే ఎక్కువ హవా ఉంటుంది. ఇక అలాంటి యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈమె ఓవైపు టీవీషోలు, మరోవైపు సినిమాలతో బిజీగా ఉంది. ఈమెకు ఎంతో మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో శ్రీముఖిని ఫాలో అయ్యేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.
శ్రీముఖి ఈ మధ్య కాలంలో అనేక షోలలో సందడి చేస్తోంది. అయితే ఈ అమ్మడు తన రెమ్యునరేషన్‌ను ఇటీవల భారీగా పెంచిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈమె ఒక్క టీవీ షో ఎపిసోడ్ చేస్తే రూ.1.50 లక్షల వరకు తీసుకునేదట. కానీ దాన్ని రూ.50వేలు పెంచిందని సమాచారం. దీంతో ఆమె టీవీ షో ఒక్క ఎపిసోడ్‌కు రూ.2 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అనధికారిక సమాచారమే. ఈ క్రమంలోనే శ్రీముఖి సంపాదనలోనూ ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.
ఇక శ్రీముఖి తెలుగులో బిగ్‌బాస్‌లోనూ పాల్గొంది. బిగ్‌బాస్ సీజన్ 3లో ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే ఈమెకు ఆ షో మరింత పేరు తెచ్చి పెట్టింది. ఇక ప్రస్తుతం ఈమె టీవీల్లో పలు షోస్ చేస్తోంది. సూపర్ మామ్, సూపర్ సింగర్, పటాస్, కామెడీ నైట్స్, జీ సరిగమప, స్టార్ మ్యూజిక్ రీలోడెడ్, సెలబ్రిటీ కబడ్డీ లీగ్, బొమ్మ అదిరింది వంటి షోలు చేస్తోంది. అలాగే 2015లో దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌లో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. ఈమె చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…