Manmadhudu : నాగార్జున ఎవ‌ర్ గ్రీన్‌ క్లాసిక్.. మ‌న్మథుడు మూవీ అస‌లు ఎలా ప్రారంభం అయిందో తెలుసా..?

Manmadhudu : మన్మథుడు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ ఒక్క టైటిల్ కి పర్ఫెక్ట్ హీరో ఎవరంటే అందరి నుంచి వచ్చే సమాధానం నాగార్జుననే.. నాగ్ కి ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చినప్పటికీ మగువల దృష్టిలో మాత్రం నవ మన్మథుడే. ఇదే టైటిల్ తో 19 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి నిజంగానే తానూ మన్మథుడు అని చూపించారు నాగ్.. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన నాలుగో సినిమానే మన్మథుడు. ఇప్ప‌టికీ మ‌న్మ‌థుడు టీవీలో వ‌స్తుంటే ఛాన‌ల్ మార్చ‌కుండా చూస్తూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.

2002 డిసెంబ‌ర్ 22న విడుద‌లైన ఈ సినిమాలోని కొన్ని ఇన్న‌ర్ విష‌యాల‌ను తెలుసుకుందాం. 2001వ సంవ‌త్స‌రం నువ్వు నాకు న‌చ్చావ్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌ కావడంతో త్రివిక్ర‌మ్, భాస్క‌ర్ లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎందుకంటే ఇది వారికి స్వ‌యంవ‌రం, నువ్వే కావాలి త‌ర్వాత వ‌చ్చిన మూడ‌వ హిట్‌. దాంతో శ్రీను నెక్స్ట్ ఏమి సినిమా చేద్దాం అని విజ‌య్‌భాస్క‌ర్ త్రివిక్ర‌మ్‌తో అంటే.. త్రివిక్ర‌మ్ వెంట‌నే నా ద‌గ్గ‌ర రెండు క‌థ‌లున్నాయి. కానీ నాకు కూడా ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని ఉంది భాస్క‌ర్ అన్నారు. అందుక‌ని ఏమి చేద్దాం నువ్వే చెప్పు అన్నారు త్రివిక్ర‌మ్‌. దీనికి ఇంత ఆలోచించ‌డం దేనికి నువ్వే నువ్వే క‌థ‌ను హీరో త‌రుణ్‌ని పెట్టి నువ్వే తియ్యి. రెండో క‌థ‌ని నేను ఎవ‌రినైనా హీరోగా పెట్టి తీస్తాను. త‌రుణ్ అంటే ఆల్రెడీ నీ డైలాగుల‌కు సింక్ అవుతాడు అన్నారు.

Manmadhudu

అంతేకాకుండా నువ్వు కొత్త క‌దా మిగ‌తా అన్ని క్రాఫ్ట్స్‌లో కొత్త‌వాళ్ళ‌ని పెట్టుకో స‌రిపోతుంది అన్నారు విజ‌య్‌భాస్క‌ర్‌. త్రివిక్ర‌మ్‌కి కూడా త‌న స‌ల‌హా న‌చ్చి స‌రే మ‌రి నీ సంగ‌తేంటి అన్నారు త్రివిక్ర‌మ్‌. నాదేముంది ఇద్ద‌రు ముగ్గురిని క‌లిసి క‌థ చెపుతాను నువు రాసిన క‌థ అంటే క‌చ్చితంగా ఒప్పుకుంటారు. త్రివిక్ర‌మ్ క‌థ‌ను విజ‌య్‌భాస్క‌ర్‌కి చెప్పి దీనికి టైటిల్ మ‌న్మ‌థుడు అని పెడితే బాగుంటుంది భాస్క‌ర్ అన్నారు. ఇక క‌థ వింటున్న‌ప్పుడే విజ‌య్‌భాస్క‌ర్ చాలా ఎంజాయ్ చేశారు. మ‌న్మ‌థుడు అంటే మ‌న టాలీవుడ్‌లో నాగార్జున మాత్ర‌మే స‌రిపోతారు. కానీ దీనికి ఆయ‌న ఒప్పుకుంటారో లేదో అన్న‌దే సందేహం అన్నారు భాస్క‌ర్‌.

త్రివిక్ర‌మ్ క‌థ చెప్ప‌డం మొద‌లు పెట్టే ముందు నాగార్జున‌తో సినిమా టైటిల్ మ‌న్మ‌థుడు కానీ హీ హేట్స్ ఉమెన్ అన్నాడు. దాంతో నాగార్జున ఇదేంటి మ‌న్మ‌థుడు అని మ‌ళ్ళీ ఇలా అంటాడు అనుకొని.. కథ పూర్తిగా విన్నాక ఓకే బాగుంది చేద్దాం అన్నారు. వెంట‌నే భాస్కర్, త్రివిక్రమ్ ఆనంద‌ప‌డ్డారు. కానీ ప్రొడ్యూస‌ర్ ఎవ‌ర‌ని ఆలోచిస్తుంటే.. నాగార్జున ప్రొడ్యూస‌ర్ గురించి వ‌ర్రీ అవ్వ‌కండి నేనే ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. ఇక మ‌న్మ‌థుడు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.. ఆ తర్వాత మ‌న్మ‌థుడు 2 కూడా తీశారు కానీ ఆ సినిమా అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది. మ‌న్మ‌థుడు చిత్రంలో ఎంత మంచి క్లీన్ కామెడీ ఉందో.. మ‌న్మ‌థుడు 2లో వ‌ల్గ‌ర్ కామెడీ పెట్టి అన‌వ‌స‌రంగా సినిమా ప‌రువు తీశారు అనిపిస్తుంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ చేశారు నెటిజన్స్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM