Ratha Saptami : ఈ నెల 8న ర‌థ స‌ప్త‌మి.. సూర్య భ‌గ‌వానున్ని ఇలా పూజిస్తే.. స‌క‌ల సంప‌ద‌లు మీ వెంటే..!

Ratha Saptami : హిందువులు జ‌రుపుకునే అనేక ర‌కాల పండుగ‌ల్లో ర‌థ‌సప్త‌మి ఒక‌టి. దీన్ని కొంద‌రు మాత్ర‌మే జ‌రుపుకుంటారు. కానీ వాస్త‌వానికి ర‌థ స‌ప్త‌మి రోజు సూర్య భ‌గ‌వానుడికి ప్ర‌ధానంగా పూజ చేయాలి. స‌మ‌స్త ప్రాణికోటికి ఆయన వెలుగునిస్తాడు క‌నుక ఆ రోజు ఆయ‌న‌ను పూజిస్తే ఎంతో మంచిద‌ని పండితులు చెబుతున్నారు. ఇంట్లో అనేక స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, అనారోగ్యాల‌తో ఇబ్బందులు ప‌డుతున్న వారు ర‌థ స‌ప్త‌మి రోజు పూజ‌లు చేస్తే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు.

Ratha Saptami

ఇక ర‌థ స‌ప్త‌మిని మాఘ శుద్ధ స‌ప్త‌మి రోజున జ‌రుపుకుంటారు. మాఘ మాసంలో వ‌చ్చే స‌ప్త‌మి తిథికి చాలా విశిష్ట‌త‌ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున మ‌క‌ర సంక్రాతిని జ‌రుపుకుంటారు. సూర్యుడి పుట్టిన రోజునే మ‌నం ర‌థ స‌ప్త‌మిగా జ‌రుపుకుంటాం. ర‌థ‌ స‌ప్త‌మికి సూర్య జ‌యంతి, మాఘ స‌ప్త‌మి, అచ‌ల స‌ప్త‌మి, సూర్య ర‌థ స‌ప్త‌మి అనే పేర్లు ఉన్నాయి. ర‌థ స‌ప్త‌మి రోజున‌ సూర్య భ‌గ‌వానుడిని పూజించ‌డం వ‌ల్ల‌ ఏడు జ‌న్మల పాపాలు, ఏడు ర‌కాల వ్యాధులు పోతాయ‌ని విశ్వ‌సిస్తారు.

ఈ రోజున చేసే పూజ‌లు, దానాల వ‌ల్ల‌ ఎంతో పుణ్యం వ‌స్తుంద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ర‌థ‌ స‌ప్త‌మిని ఏ రోజున జ‌రుపుకోవాల‌నే సందేహం కొంద‌రిలో ఉంది. పంచాంగం ప్ర‌కారం స‌ప్త‌మి తిథి ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన ఉద‌యం 7.35 గంట‌ల నుండి ఫిబ్ర‌వ‌రి 8వ తేదీన‌ ఉద‌యం 8.36 గంట‌ల‌ వ‌ర‌కు ఉంది. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన‌ సూర్యోద‌యానికి స‌ప్త‌మి తిథి లేనందున 8వ తేదీన ర‌థ స‌ప్త‌మిని జ‌రుపుకోవాలి. ఉద‌యం 6.35 నుండి 8.36 గంట‌ల‌ వ‌ర‌కు ర‌థ స‌ప్త‌మి పూజ‌ను చేసుకోవ‌చ్చు.

ర‌థ స‌ప్త‌మి నాడు చేసే స్నానానికి ఎంతో విశిష్ట‌త ఉంది. ఈ రోజున‌ ఏడు జిల్లేడు ఆకుల‌ను లేదా ఏడు రేగు ఆకుల‌ను త‌ల‌పై పెట్టుకొని స్నానం చేయాలి. దీంతో ఆ ఆకుల‌లోని ఔష‌ధ గుణాలు శ‌రీరానికి అందుతాయి. ఏడు చిక్కుడు కాయ‌ల‌తో ర‌థాన్ని చేసి దాన్ని సూర్య భ‌గ‌వానుడి ర‌థంగా భావించాలి. సూర్య కిర‌ణాలు ప‌డే చోట పాల‌తో ఇత్త‌డి పాత్ర‌లో పాయ‌సం వండి, దానిని ఏడు చిక్కుడు ఆకుల‌లో పెట్టి, సూర్య భ‌గ‌వానుడికి నైవేద్యం స‌మ‌ర్పించాలి. దాని ప‌క్క‌న‌ ఏడు ప‌ద్మాల‌తో ర‌థం ముగ్గు వేసి అందులో సూర్యుడి ప్ర‌తిమ‌ను గీసి పూజను చేసుకోవాలి. ఆదిత్య హృద‌యం, సూర్య మండ‌ల స్తోత్రం, సూర్యాష్ట‌కం వంటి స్తోత్రాల‌ను చ‌దువుకోవాలి. చిక్కుడు ఆకుల‌లో పెట్టిన ప్ర‌సాదాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

ఇలా ర‌థ స‌ప్త‌మి నాడు సూర్య భ‌గ‌వానుడికి పూజ‌లు చేయ‌డం వ‌ల్ల ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌కు ఉండే అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM

చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో…

Thursday, 26 March 2026, 6:09 PM

‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

ధురంధ‌ర్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ఈ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు…

Thursday, 26 March 2026, 3:43 PM