Curry leaves powder benefits : కరివేపాకు పొడితో ఎన్నిలాభాలో తెలుసా..!

Curry leaves powder benefits : మన భారతీయ వంటకాలలో ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. సాధారణంగా వంట రుచిగా ఉండడానికి  కరివేపాకును ఉపయోగిస్తుంటారు. కరివేపాకును కేవలం వంటకాల రుచిని పెంచడానికి ఉపయోగిస్తాము అనుకుంటే మాత్రం పొరపాటే. కరివేపాకు రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, పాస్పరస్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ఎన్నో పోషకాలు కరివేపాకు నుంచి లభిస్తాయి. కరివేపాకు ఆకులు, కాయలు, వేరు బెరడు, కాండం బెరడు ఇలా అన్నింటిని ఔషధ రూపంలో వాడతారు.

కరివేపాకు కాలేయం మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు.. బరువు తగ్గించడంలోనూ సహయపడుతుంది. పరగడుపునే ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ మనలో చాలామంది కరివేపాకు ఆహారంలో తగిలితే వెంటనే తీసి పక్కన పెట్టేస్తారు. పచ్చి కరివేపాకును తినడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు కరివేపాకును పొడి చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎవరు కూడా కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు కోల్పోకూడదు అనుకుంటే ఇప్పుడు చెప్పే విధంగా పొడి చేసుకొని ఆహారం ద్వారా తినిపించవచ్చు.   ఇప్పుడు కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం.

Curry leaves powder benefits

మొదట పాన్ స్టాప్ పై పెట్టి అందులో నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర పచ్చిశనగపప్పు, మిరియాలు, చింతపండు వేసి చిన్న మంట మీద వేయించాలి. వేయించిన ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత  పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు బాగా వేగిన తరువాత అందులో కరివేపాకు, ఇంగువ వేసి కరివేపాకు బాగా వేగేవరకు వేయించాలి. కరివేపాకును ముట్టుకుంటే విరిగిపోయేంత వరకు వేయించుకోవాలి. వేయించిన ఈ మిశ్రమం చల్లారిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని పొడి చేసుకోవాలి.

ఇక పిల్లలు తినే అన్నంలో కరివేపాకును తీసి పక్కన పడేస్తారు అనే భయం లేకుండా వుండాలంటే.. అన్ని కూరల్లో కరివేపాకు పొడి చేసి వేస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసిన కరివేపాకు పొడిని చక్కగా స్పూన్ నెయ్యి వేసి అన్నంలో కలిపి రోజు మొదటగా రెండు ముద్దలు పెడితే చాలు. పిల్లలలో ఆకలి పెరగడంతోపాటు అజీర్ణ సమస్య కూడా తగ్గుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM