Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఇటు కుటుంబ సభ్యులు, అటు అభిమానులు భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజును రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగలా నిర్వహిస్తామని ఫ్యాన్స్ అంటున్నారు. అదేవిధంగా చిరంజీవి బర్త్ డే వేడుకలను ఈ నెల 22న హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ నిర్వహిస్తామని మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి రెండు సంవత్సరాలుగా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. కానీ ఈసారి మాత్రం గట్టిగా ప్లాన్ చేశారు. వారం రోజుల నుండే చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల రక్తదాన శిబిరాలు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ల అధ్యక్షులు పర్యవేక్షిస్తున్నారు.
అన్నయ్య (చిరంజీవి) బర్త్‌డే సందర్భంగా ఈ నెల 22న హైదరాబాద్ హైటెక్స్‌లో కార్నివాల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం అని నాగబాబు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్‌డేని శిల్పకళా వేదికలో చేసేవాళ్లం. అయితే ఈ ఏడాది ఫ్యాన్స్ కోసం హైటెక్స్‌లో కార్నివాల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలో చిరంజీవి గురించి ఎవరికీ తెలియని విషయాలు పంచుకుంటాను. ఈ ఫెస్టివల్‌కి మా ఫ్యామిలీ నుంచి అందరు హీరోలు హాజరవుతారు. అలాగే ఇతర హీరోలు, ఆయన్ని అభిమానించేవారు కూడా పాల్గొంటారు. ఈ ఫెస్టివల్‌కి అన్ని ప్రాంతాల మెగా అభిమానులు తప్పకుండా రావాలి అన్నారు నాగబాబు.
టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు దాదాపుగా అయిదు కోట్ల వరకు ఖర్చు అవుతూ ఉంటుందని.. అదంతా స్థానిక ఫ్యాన్స్ ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అభిమాన సంఘం పేరుతో సేవా కార్యక్రమాలు చేయడం హర్షించదగ్గ విషయం. మొత్తానికి మెగా పండుగ కాస్త ఖరీదైనప్పటికీ అభిమానులు ఆనందించేదిగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మెగా ఫ్యాన్స్ హంగామా ఆ రోజు ఎలా ఉంటుందో..!
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…