Bigg Boss 6 : బుల్లితెర రియాలిటీ షోల్లో బిగ్‌బాస్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీతో మొదలై అన్ని భాషల్లోనూ ఈ గేమ్‌షో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక తెలుగు ప్రేక్షకుల ఆదరణతో ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ మధ్యన నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఓటీటీలో వచ్చిన బిగ్‌బాస్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ లోటును భర్తీ చేసేందుకు త్వరలోనే కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇక దీనికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. బజ్‌కి శివ యాంకర్‌గా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది.
మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో సీజన్ 6 ఆటను మరింత ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. వారిలో 10 మంది అమ్మాయిలు కాగా.. 9 మంది అబ్బాయిలు ఉండబోతున్నారు. వీరిలో సినిమా, టీవీ సెలబ్రీటీలు, యాంకర్లు, యూట్యూబర్స్, సోషల్ మీడియా సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా ఉండబోతుండగా.. కామన్ మెన్/ ఉమెన్ కేటగిరీలో ఇద్దరు ఉండబోతున్నారు. లాంచింగ్ రోజున 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లబోతుండగా.. మిగిలిన నలుగుర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపబోతున్నారు.
వాస్తవానికి బిగ్ బాస్ షోలో జరిగే తీరు మొత్తం సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ ఇందులోని ప్రతి విషయం బయటకు వస్తూనే ఉంది. దీంతో ఆరో సీజన్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. సీనియర్ యాంకర్ ఉదయ భాను ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేయనుందని అనే సరికి అందరికీ దీనిపై ఆసక్తి పెరిగింది. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. ఇటీవలే ఈ సీజన్ మెయిన్ ప్రోమోను రిలీజ్ చేశారు. దీనికి భారీ స్పందన వచ్చింది. దీన్ని బట్టే ఈ సీజన్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ షో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…