గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 : లెక్క‌లు మారిపోతున్నాయిగా.. కాజల్, ర‌విలో బ‌య‌ట‌కు వెళ్లేది ఎవ‌రు ?

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.సెప్టెంబ‌ర్ 5న 19 మంది కంటెస్టెంట్స్ తో మొద‌లైన ఈ షో డిసెంబర్ 20 నాటికి ముగుస్తుంది. ఆ రోజు విజేత ఎవరో తెలిసిపోతుంది.…

Bigg Boss 5 : లెక్క‌లు మారిపోతున్నాయిగా.. కాజల్, ర‌విలో బ‌య‌ట‌కు వెళ్లేది ఎవ‌రు ?

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.సెప్టెంబ‌ర్ 5న 19 మంది కంటెస్టెంట్స్ తో మొద‌లైన ఈ షో డిసెంబర్ 20 నాటికి ముగుస్తుంది. ఆ రోజు విజేత ఎవరో తెలిసిపోతుంది. అయితే గేమ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంటున్న నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. టాప్ 5లో ఎవ‌రు ఉంటారు, ట్రోఫీ ఎవ‌రు అందుకుంటారు, ఈ వారం ఎలిమినేట్ అవుతారు ? అంటూ బిగ్ బాస్‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

Bigg Boss 5 who will exit from house between ravi and kajal

ఈ వారం నామినేష‌న్‌లో మానస్, రవి, కాజల్, సిరి, షణ్ముఖ్ లు ఉండ‌గా ఇందులో ర‌వి, కాజ‌ల్‌లు డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కాజల్ తోపాటుగా ఓట్ల లో రవి వెనుకబడి ఉన్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఫైట్ ఆస‌క్తిక‌రంగా న‌డుస్తోంది. యాంక‌ర్‌గా ర‌వి టాప్ రేంజ్‌లో ఉన్నా కూడా మ‌నోడికి ఓట్లు త‌క్కువ ప‌డుతుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.. అంటున్నారు. సోష‌ల్ మీడియాలో కూడా ర‌వికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

మ‌రి రవిని ఎలిమినేషన్ ప్రక్రియ నుండి కాపాడటానికి అతని టీమ్ బయట ఏం చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే అందరి దృష్టి టాప్ ఫైవ్ మీద ఉంది. లేటెస్ట్ గా కండల వీరుడు విశ్వ కూడా బయటకు వచ్చాక టాప్ ఫైవ్ లెక్కలు మరీ ఎక్కువ అయ్యాయి. అదీకాక అనారోగ్యంతో జ‌స్వంత్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఇక అతను మ‌ళ్లీ లోపలికి పోవ‌డం క‌ష్టం. దీంతో సింగర్ శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్ టాప్ ఫైవ్ లో ఉంటారని అంటున్నారు. మరో వైపు చూస్తే రవి, కాజల్ కూడా వీరికి టఫ్ ఫైట్ ఇస్తారని టాక్ నడుస్తోంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి