Bigg Boss 5 : ఒకరి జీవితంతో మరొకరు ఆడుకోవద్దు.. ఆ కంటెస్టెంట్ లకు విశ్వ వార్నింగ్..!

November 10, 2021 9:51 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ 9వ వారంలో ఎవరూ ఊహించని విధంగా కండలవీరుడు విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. ఒక్కసారిగా విశ్వ ఎలిమినేట్ అనే విషయం తెలియడంతో ప్రేక్షకులు, హౌస్ సభ్యులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన విశ్వ.. అరియనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి వచ్చాడు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ ల గురించి విశ్వ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Bigg Boss 5  vishwa warns to those two contestants

బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామచంద్రని తన తమ్ముడిగా భావించే విశ్వ అతను ఫైటర్ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా మానస్ గురించి మాట్లాడుతూ అతను ఓటమి కూడా ఒప్పుకోవాలని తెలిపాడు. ఈ క్రమంలోనే హోస్ట్ మాట్లాడుతూ.. హౌస్ లో గ్రూప్స్ ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా గ్రూప్స్ వల్ల ఎవరైనా సేవ్ అయ్యారా అనే ప్రశ్నను అడగగా.. అందుకు సమాధానం చెబుతూ.. సిరి, జెస్సీ, షన్ను పేర్లను చెప్పాడు.

ఇక రవి గురించి మాట్లాడుతూ.. అతను చెప్పేది అందరూ వింటారు, చాలా బాగుంటుంది. అయితే పక్కన వాళ్లు చెప్పేది కూడా రవి వినాలని.. సూచించాడు. ఇక షన్ను గురించి మాట్లాడుతూ.. అతను రెండు పడవలపై ప్రయాణం చేస్తుంటాడు. అది మానుకోవాలని విశ్వ వెల్లడించాడు.  సిరి, షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ వీళ్ళిద్దరూ బయట ఫ్రెండ్స్ కావచ్చు.. లేదా ఇక్కడ ఫ్రెండ్స్ కావచ్చు, కానీ ఒకరి జీవితంతో మరొకరు ఆడుకోకూడదు.. అంటూ ఈ సందర్భంగా వారిద్దరికీ విశ్వ వార్నింగ్ ఇచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment