గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్ అయిన ఇంటి సభ్యులు వీరే!

Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో విపరీతంగా పాపులర్ అయిన షో బిగ్ బాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ ఫేవరెట్…

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్ అయిన ఇంటి సభ్యులు వీరే!

Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో విపరీతంగా పాపులర్ అయిన షో బిగ్ బాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ ఫేవరెట్ సెలెబ్రిటీలను ఒకే ఇంట్లో చూసుకుంటూ.. గాసిప్స్, రూమర్స్ తోపాటు కంప్లీట్ ఎంటర్ టైనింగ్ టాస్కులు, డాన్సులతో ఆడియన్స్ ని కంప్లీట్ గా అలరిస్తున్నారు. అలాగే తెలుగులో కూడా బిగ్ బాస్ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుని.. సక్సెస్ ఫుల్ గా 5 వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss 5 these are the house mates nominated for this week

ఈ సీజన్ లో లేటెస్ట్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎనిమిదో వారం ఎలిమినేషన్ పక్రియ స్టార్ట్ అయ్యింది. లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రియ ఎలిమినేషన్ తో టోటల్ గా ఇప్పటివరకు ఏడుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. లాస్ట్ వీక్ వరస్ట్ పర్ఫార్మెర్ గా ఇంటి సభ్యులంతా విశ్వని సెలెక్ట్ చేసి జైలుకి పంపారు.

ఈ వారం నామినేషన్స్ లో లోబో, రవి, షణ్ముక్, మానస్, శ్రీరామ్, సిరిలు టార్గెట్ అయ్యారు. వీక్ మొత్తంలో నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో వాళ్ళే ఇంటి నుండి బయటకు వెళ్తారు. ఈ వారం వీరంతా నామినేట్ అవ్వడంతో ఎవరు, ఎవర్ని, ఎందుకు నామినేట్ చేశారో తెలియాలంటే ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ని చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి