Bigg Boss 5 : ఈ సీజ‌న్‌కు ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేనట్లే..? ఎన్నో అనుమానాలు..?

November 7, 2021 9:01 AM

Bigg Boss 5 : ప్ర‌స్తుతం బిగ్ బాస్ 5 సీజ‌న్ ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. ప్లేయ‌ర్లు ఒక‌రితో ఒక‌రు పోటీలు ప‌డి మ‌రీ టాస్కులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో స‌మాచారం అందుతోంది. బిగ్ బాస్‌ను చూసేవారికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి తెలుసు. అయితే మొద‌టి సీజ‌న్‌లో న‌వ‌దీప్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకువ‌చ్చి ర‌చ్చ రచ్చ చేశారు.

Bigg Boss 5 there might be no wild card entry for this season

ఇక రెండు, మూడు, నాలుగో సీజ‌న్ల‌లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీల రూపంలో కంటెస్టెంట్లు సంద‌డి చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండ‌దా ? అని అంద‌రిలోనూ సందేహాలు నెలకొంటున్నాయి. దీనిపై షో నిర్వాహ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేదు. ప్రోమోల్లోనూ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో ఈ సీజ‌న్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి అంద‌రిలోనూ అనుమానాలు నెల‌కొన్నాయి.

ఇక ప్ర‌స్తుత సీజ‌న్‌కు గాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ‌స‌రం లేద‌ని షో నిర్వాహ‌కులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సీజ‌న్ ఇప్ప‌టికే ట‌ఫ్‌గా మారింది. కంటెస్టెంట్లు చాలా హార్డ్‌గా పోటీ ప‌డుతున్నారు. వారిలో వారికే కాంపిటీష‌న్ బాగా పెరిగిపోయింది. పైగా టీఆర్‌పీ రేటింగ్స్ కూడా బాగానే వ‌స్తున్నాయి. దీంతోపాటు 60 రోజులు కూడా దాటి పోయింది. క‌నుక ఈ ద‌శ‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీని తెస్తే బాగుండ‌దేమోన‌ని, కంటెస్టెంట్లు ఇప్ప‌టికే బాగా ఆడుతున్నారు క‌నుక వారి గేమ్ డిస్ట‌ర్బ్ అవుతుంద‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌. అందుక‌నే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఈ సారి ప్ర‌వేశ‌పెట్ట‌డం లేద‌ని తెలుస్తోంది.

హౌస్‌లో కంటెస్టెంట్లు బాగా ఆడ‌లేక‌పోయినా, షో చ‌ప్ప‌గా సాగినా, రేటింగ్స్ లేక‌పోయినా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీని తెచ్చే అవ‌కాశాలు ఉంటాయి. కానీ ప్ర‌స్తుత సీజ‌న్‌లో అన్నీ బాగానే ఉన్నాయి. రేటింగ్స్ కూడా ఉన్నాయి. ఒక ఫ్లోలో సాగుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీని తెస్తే ప‌రిస్థితి మారితే.. అప్పుడు త‌ల‌లు ప‌ట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని, అలాంటి రిస్క్ ఎందుక‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌. క‌నుక‌.. ఈ సీజ‌న్‌కు ఇక ఇంతేన‌ని.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండ‌బోద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి నిర్వాహ‌కులు ఏం చేస్తారో చూడాలి. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తేనే ఈ విష‌యంలో ఒక స్పష్ట‌త వ‌స్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment