గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 Telugu : ఈ వారం కాజ‌ల్ ఎలిమినేష‌న్‌.. తప్ప‌దా..?

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 రోజు రోజుకీ ఎంతో ఉత్సాహంగా కొన‌సాగుతోంది. వారాలు గ‌డుస్తున్న కొద్దీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతుండ‌డంతో.. ప్రేక్ష‌కుల్లోనూ ఒకింత ఆస‌క్తి నెల‌కొంటోంది. ఇక ఈ వారం…

Bigg Boss 5 Telugu : ఈ వారం కాజ‌ల్ ఎలిమినేష‌న్‌.. తప్ప‌దా..?

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 రోజు రోజుకీ ఎంతో ఉత్సాహంగా కొన‌సాగుతోంది. వారాలు గ‌డుస్తున్న కొద్దీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతుండ‌డంతో.. ప్రేక్ష‌కుల్లోనూ ఒకింత ఆస‌క్తి నెల‌కొంటోంది. ఇక ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారా ? అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వారం మ‌ళ్లీ ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Bigg Boss 5 Telugu kajal may be eliminated this week from house

బిగ్‌బాస్ హౌస్‌లో నామినేష‌న్‌లో ఉన్న ర‌వి, స‌న్నీల‌కు ఓట్లు బాగానే ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక మాన‌స్‌కు కూడా ఓట్లు బాగానే ప‌డుతున్నాయ‌ని స‌మాచారం. మిగిలిన‌వారు సిరి, కాజ‌ల్‌. ష‌ణ్ముఖ్ ఎలాగూ నామినేష‌న్స్‌లో లేడు, కాబ‌ట్టి అత‌ని ఓట్లు ఈసారి సిరికి ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం సిరి సేవ్ అవనుంది.

అయితే కాజ‌ల్‌కు మాత్రం త‌క్కువ ఓట్లు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం కాజ‌ల్ ఎలిమినేట్ అవుతుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు ఫీమేల్ కంటెస్టెంట్లు అయిన‌ స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, హ‌మీదా, శ్వేత‌, ప్రియ లను బ‌య‌ట‌కు పంపారు. దీంతో ఈ వారం కాజ‌ల్‌ను బ‌య‌ట‌కు పంప‌నున్నార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే మ‌రో ఫీమేల్ కంటెస్టెంట్ బ‌య‌ట‌కు పోయిన‌ట్లే అవుతుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి