Bigg Boss 5 : రాత్రిపూట ఈ ర‌చ్చేంది సిరి.. కెప్టెన్సీ కోసం కుస్తీలు ప‌డుతున్న హౌజ్‌మేట్స్..

November 24, 2021 8:05 AM

Bigg Boss 5 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం 80 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. హౌజ్ నుండి 11 మంది స‌భ్యులు బ‌య‌ట‌కు వెళ్ల‌గా, ప్ర‌స్తుతం హౌజ్‌లో 8 మంది మాత్ర‌మే ఉన్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘నియంత మాటే శాసనం’ అనే టాస్క్ ఇచ్చారు. సైరన్ మోగిన ప్రతిసారీ ఏ సభ్యుడైతే నియంత సింహాసనంపై కూర్చుంటాడో వారు ఆ రౌండ్‌లో సేఫ్ కావడంతోపాటు నియంతగా వ్యవహరిస్తారు.

Bigg Boss 5 siri doing shocking things on shanmukh big task for housemates

నియంత ఇచ్చిన ఛాలెంజెస్‌లో చివ‌రిగా నిలిచిన వారి స‌మ‌స్య‌ను సాల్వ్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. తొలి రౌండ్‌లో నియంత సింహాసనాన్ని సిరి దక్కించుకుంది. దీంతో మిగిలిన ఆరుగురికి క్యాప్ హుక్స్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో రవి, సన్నీలు మాత్రమే చివరి రెండు స్థానాల్లో నిలిచారు. సిరి.. రవిని నెక్స్ట్ రౌండ్‌కి ప్రమోట్ చేసి సన్నీకి చెక్ పెట్టింది.

ఇక రెండో రౌండ్‌లో నియంత సింహాసనాన్ని శ్రీరామ్ చేజిక్కించుకున్నాడు. మిగిలిన ఇంటి సభ్యులకి మరో టాస్క్ ఇచ్చారు. కాళ్లకి చెప్పులు ధరించి ఆ చెప్పుల్ని ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో అతికించాల్సి ఉంటుంది.. ఎవరైతే ఎక్కువ ఎత్తులో ఆ చెప్పుల్ని అతికిస్తారో వాళ్లు సేవ్ అవుతారని.. తక్కువ ఎత్తులో చెప్పుల్ని అతికించిన చివరి ఇద్దరి సభ్యులు నియంతని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ టాస్క్‌లో కాజల్, రవిలు చివరి స్థానాల్లో నిలవగా ర‌విని సేవ్ చేసిన శ్రీరామ్ కాజ‌ల్‌ని డిస్ క్వాలిఫై చేశాడు.

ఇక మూడోసారి యాంకర్ రవి.. నియంత సింహాసనాన్ని దక్కించుకున్నాడు. మిగిలిన ఇంటిసభ్యులకు ఆరెంజ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన మానస్, షణ్ముఖ్‌లు నియంత రవి దగ్గర పంచాయితీ పెట్టారు. అయితే ఈ ఇద్దర్లో రవి.. షణ్ముఖ్‌ని సేవ్ చేసి మానస్‌ని డిస్ క్వాలిఫై చేశాడు. నాలుగో రౌండ్‌లో ప్రియాంక నియంత సింహాసనాన్ని దక్కించుకుంది. వాటర్ డ్రమ్స్ టాస్క్ ఇవ్వ‌గా ఈ ఛాలెంజ్‌లో షణ్ముఖ్, శ్రీరామ్‌లు చివరి రెండు స్థానాల్లో నిలవడంతో వీళ్లలో షణ్ముఖ్‌ని సేవ్ చేసింది.

ఐదో రౌండ్‌లో భాగంగా.. నియంత సింహాసనంపై కూర్చోవడానికి రవి, షన్నూ, సిరి, ప్రియాంకలు పోటీపడ్డారు. అయితే బజర్ మోగే సమయానికి సిరి, ప్రియాంకలు ఇద్దరూ ఒకేసారి సింహాసనంపై కూర్చున్నారు. అయితే ప్రియాంక కంటే సిరినే ముందు కూర్చున్నట్టుగా విజువల్‌లో కనిపించింది. నేటి ఎపిసోడ్‌లో కెప్టెన్‌గా ఎవర్ని ఎంచుకోవాలో ఇంటి సభ్యుల నిర్ణయానికే వదిలేశారు బిగ్ బాస్.

రాత్రి పడుకునేటప్పుడు సిరికి ఏమైనా పూనకం వస్తుందో ఏమో కానీ.. ఒకే బెడ్‌పై పడుకోవద్దని షణ్ముఖ్ అన్నప్పటి నుంచి సిరి వింత వింతగా ప్రవర్తిస్తూ వస్తోంది. షణ్ముఖ్ పడుకుని ఉంటే అతని పైకి ఎక్కేసి సిరి.. హగ్‌లతో రెచ్చిపోయింది. ఇది చూసి ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment