Bigg Boss 5 : నోరు జారిన ష‌ణ్ముఖ్‌.. ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్..!

October 30, 2021 10:34 AM

Bigg Boss 5 : టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రజంట్ సీజన్ 5 సూపర్ స్పీడ్ గా రన్ అవుతున్న ప్రోగ్రామ్. టాప్ కంటెస్టెంట్స్ లో ఒకడిగా షణ్ముఖ్ ఉన్నాడు. అతను బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన కొత్తలో చాలా తక్కువగా కనిపించాడు. అలాగే గేమ్స్ మీద కూడా ఫోకస్ చేయలేదు. కానీ రాను రాను నాగార్జున.. షణ్ముఖ్ ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగేలా చేసి బూస్టప్ ఇచ్చారు. అయినా కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో చాలా స్లోగా ఉండటమే కాకుండా ఆడియన్స్ దృష్టిలో సోమరితనంగా బిహేవ్ చేస్తున్నాడనే ఫీలింగ్ ని తెప్పించాడు. ఇక అతని ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టి అనవసరమైన విషయాలపై డిస్కషన్స్ చేయడంలో మాత్రం బ్రహ్మను తలపించాడంటూ.. షణ్ముఖ్‌ని, నాగార్జున బ్రహ్మ అని పిలిచారు.

Bigg Boss 5 shanmukh tongue slip fans worrying about him

కానీ లేటెస్ట్ గా జరుగుతున్న బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో షణ్ముఖ్‌ ఆటని చూస్తున్న ప్రేక్షకులకే కాకుండా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కూడా షాకింగ్ గా ఉంది. ఎందుకంటే షణ్ముఖ్‌ కొన్ని సిచువేషన్స్ లో లూజ్ టాక్ తో తన ఇమేజ్ ని డామేజ్ చేసుకుంటున్నాడు. దీంతో సోషల్ మీడియాలో కూడా షణ్ముఖ్ ఫ్యాన్స్ ఎక్కడ ఎలిమినేట్ అవుతాడనే విషయంలో టెన్షన్ పడుతున్నారు. లాస్ట్ ఎపిసోడ్ హౌస్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత సిరితో ఓ సాంగ్ చేయడానికి అడిగినప్పుడు చాలా సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఈ విషయంలో సిరిపై గొడవ పడినా.. ఆ తర్వాత సారీ చెప్పి గొడవను సర్థుబాటు చేసుకున్నాడు.

కాకపోతే ఇలాంటి బిహేవియర్ తో షణ్ణుకు ఓట్లేమైనా తక్కువ పడతాయా అనేది ఆలోచించాలని అంటున్నారు అభిమానులు. షణ్ముఖ్ యూట్యూబ్ లో తన కవర్ సాంగ్స్ , వెబ్ సిరీస్ లతో బాగా ఫేమస్ అయ్యాడు. సో ఆ పాయింట్ లోనే హౌస్ మేట్స్ కవర్ సాంగ్స్ చేయాలని అడిగారు. అందులో తప్పేం లేదు. కానీ షణ్ముఖ్ మాత్రం కాస్త ఎక్కువగానే ఫీల్ అయినట్లు అనిపించింది. సెటైర్లు వేసే బదులు ఒకే తర్వాత చూద్దాం అని కూడా స్కిప్ చేయొచ్చు. లేదంటే అంత హైపర్ గా రియాక్ట్ అయితే అతనికే ఇబ్బంది అనే విషయంలో షణ్ముఖ్ కాస్త క్లారిటీ తెచ్చుకుంటే బెటర్. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment